నిస్సాన్, రెనాల్డ్ సంయుక్తంగా ఎక్స్ ట్రైల్ ఎస్ యూవీ కార్ ని అభివృద్ధి చేశాయి. ఈ కార్ సీఎంఎఫ్-సి ప్లాట్ ఫాంపై ఆధారపడి పనిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా బలమైన హైబ్రిడ్‌తో మల్టీపుల్ పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందించనున్నాయి. అయితే మన దేశంలో సింగిల్ ఇంజిన్ ఆప్షన్ లో మాత్రమే ఈ కార్ అందుబాటులో ఉంటుందట.నిస్సాన్ మోటార్ ఇండియా కంపెనీ తన నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్ యూవీని దాదాపు రెండేళ్ల క్రితమే  పరిచయం చేసింది. 2022 నవంబర్ నెలలోనే ఎక్స్ ట్రైల్ ను ప్రదర్శించింది. చివరకు దేశ మార్కెట్ లో ఈ కార్ ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ కార్ ధర రూ.40 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఈ ఎక్స్ ట్రైల్ ఐదు, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులోకి రానుంది. అయితే మన దేశంలో ఎలా రానుందో మాత్రం కచ్చితంగా ఆధారాలు లేవు. 


ఇది 1.5 లీటర్ మూడు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తుందని తెలుస్తుంది.నిస్సార్ ఎక్స్ ట్రైల్ ఎస్ యూవీ కారు పొడవు 4.6 మీటర్లకు పైగా ఇంకా వీల్ బేస్ 2,705 ఎంఎంగా ఉంటుంది. డిజైన్ పరంగా ఎంతో ఆకట్టుకుంటోంది. పెద్ద గ్రిల్‌తో స్ప్లిట్ ఎల్ ఈడీ హెడ్‌లైట్ సెటప్‌, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఇంకా డిఫ్యూజర్‌తో కూడిన ఎల్ఈడీ టైల్‌లైట్లు ఈ కారులో ఉన్నాయి.ఇంకా అలాగే వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే/ ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన ఫ్రీ స్టాండింగ్ 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పవర్డ్ టెయిల్‌గేట్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన హీటెడ్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. స్పీకర్ ప్రీమియం బోస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెచ్ యూడీ డిస్‌ప్లే, అడాస్, 360 డిగ్రీల కెమెరా వంటి సూపర్ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: