భారతదేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ రంగ సంస్థ అయిన మారుతి సుజుకి సంస్థ తన మారుతి వ్యాగన్ఆర్, బ్యాలనో మోడల్స్ కు సంబంధించిన లక్ష 30 వేలకు పైగా కార్లను రీకాల్ చేసింది.
ఇందుకు గల ప్రధాన కారణం సదరు కార్లలో ఫ్యూయల్ పంపు లోపం ఉందని, ఈ కారణం చేత వాటిని చెక్ చేసిన తర్వాత ఆపై భర్తీ చేస్తామని కంపెనీ తెలియజేసింది.
ఇక ఈ విషయానికి సంబంధించి మారుతి సంస్థ డీలర్లను అలాగే ఎవరైతే కార్లను తీసుకున్నారో వారిని సంప్రదిస్తామని తెలియజేసింది.
మారుతి సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ రెండు మోడల్స్ కలిపి ఏకంగా 134000 పైగా కార్లను రీకాల్ చేసినట్లు తెలిపింది. ఇక ఇందులో మారుతి వ్యాగన్ఆర్ కార్లు 56,000 పైగా, బ్యాలనో కార్లు 78 వేలకు పైగా ఉన్నట్లు తెలియజేసింది.
అయితే కోవిడ్ 19 లాక్ డౌన్ కారణంగా మారుతి అమ్మకాలు గత నెలలో 54 శాతం పడిపోయాయి. ఈ సంవత్సరంలో ఇదే జూన్ నెలలో ఏకంగా లక్షల వాహనాలను విక్రయించగా ఇప్పుడు కేవలం యాభై ఏడు వేలు వాహనాలు మాత్రమే అమ్మినట్లు తెలుస్తోంది.