మీ పాదాలను కొన్ని గంటల పాటు తోలు బుట్లలలో చుట్టి ఉంచడం వలన అవి ఎలా ఉంటాయో ఎపుడైనా ఆలోచించారా? నిజానికి, అవి ఒక నరకంలో ఉన్న భావనకు లోనవుతాయి. చాలా మంది పాదాల గురించి అస్సపు ఆలోచించరు. పాదాలకు మర్ధన అనగానే బహుశా మీ జేబుకు చిల్లు పడినట్లే అన్న భావన మనసులో మొదలవుతుంది. అయితే ఇంట్లోనే దశల వారీగా ఆయుర్వేద మర్ధన మార్గనిర్దేశకాల సహాయంతో మీ పాదాలకు సౌకర్యవంతమైన అనుభూతిని అందించవచ్చు.

మీ పాదాలు మృదువుగా ఉండాలంటే.. బయటే కాక ఇంట్లో ఉన్నప్పుడూ చెప్పులేసుకోవడం తప్పనిసరి. ఇంటిలోపల, ఇంటి వెలుపలికి వేరు వేరు చెప్పులు వాడటం మంచిది. అలాగే స్నానం చేసేటప్పుడు రెండు నిమిషాలు అదనంగా పాదాల కోసం కేటాయించి పాదాలను రుద్దుకుంటే అరికాలిలో ఉన్న మట్టి తొలగిపోయి పాదం మృదువుగా తయారవుతుంది. 


పాదాల శుభ్రత కోసం ఫ్యాన్సీ, బ్యూటీ పార్లర్లలో ఓ రాయిని అమ్ముతుంటారు. వీటిని కూడా వాడొచ్చు. రాత్రిపడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు ఉన్న మట్టి, సూక్ష్మజీవులుపోయి కాలు శుభ్రపడి పాదాలకు వచ్చే ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేసుకోవచ్చు. 


వేళ్లమధ్యలో ఉన్న తేమను గుడ్డతో తుడుచుకుని, తడి ఆరిన తరువాతే పడుకోవాలి. అలాకాని పక్షంలో వేళ్ల మధ్యలో ఫంగస్‌, అంటువ్యాధులు సోకే అవకాశముంది. క్రమం తప్పకుండా కాలిగోళ్లను కత్తిరించుకోవాలి. గోళ్లను ఏమాత్రం పెరగనివ్వకూడదు.


రోజూ కనీసం అరగంట నడవాలి. నడక కాలికి మంచిది. రక్తప్రసరణ పెంచుతుంది. తద్వారా అనేక రకాల పాదాల వ్యాధులను నివారించవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. మీకు కావాల్సిన వస్తువులు ఒక చిన్న టబ్ లో వెచ్చని నీటిని, కొంచెం అల్లం, ఉప్పు, పాదాలను తుడవడానికి ఒక టవల్ మరియు మర్ధన చేయడానికి ఎంపిక చేసుకున్న నూనె (కొబ్బరి నూనె, నువ్వులు లేదా ఆవాల నూనె). కానీ, వేసవి కాలంలో ఆవాల నూనె వాడకూడదు ఎందుకంటే అది శరీరంలో వేడిని ఉత్పత్తి చేయవచ్చు.


మీ పాదాలను టబ్ నుండి భయటకు తీయాలి మరియు వాటిని పొందికగా ఆరనివ్వాలి. ఇపుడు కొంచెం నూనె తీసుకొని మీ పాదాలకు పట్టించాలి అయితే మర్ధన చేసేపుడు చేతులకి మరియు కాళ్ళకి మధ్య రాపిడి చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి.


ప్రతి పాదానికి సుమారు 15 - 20 నిమిషాల పాటు మర్ధన చేయాలి. మసాజ్ ఎలా చేయాలో కింద వివరించడం జరిగింది.


మీ చేతి వేళ్ళతో చీలిమండలాల చుట్టూ వృత్తాకారంగా కదుపుతూ ప్రారంభించాలి. ఇపుడు మీ బ్రొటన వేళ్ళ సహాయంతో, మడమ నుండి పిక్క కండరాలను నెమ్మదిగా కింది వైపుగా కదులుతూ నొక్కాలి. చీలిమండల క్రింది భాగానికి మరియు కాలి వేళ్ళకి మధ్య భాగానికి మర్ధన చేయాలి. మీ చేతి బ్రొటన వేలు మరియు చూపుడు వేలును ఉపయోగించి ప్రతి కాలి వేళ్ళ మధ్య ప్రాంతంలో మర్ధన చేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: