మీ చర్మం జిడ్డోడుతూ చూడడానికి అసహ్యంగా కనిపిస్తోందా? నల్లమచ్చలు, యాక్నేలతో బాధపడుతున్నారా...? చర్మంకున్న జిడ్డుదనం వల్ల చర్మం సాగే గుణం పోతుందా? చర్మం మృదుత్వాన్ని సైతం కోల్పోతామా? అవును.... అయితే ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గాలు ఉన్నాయి. జిడ్డు చ‌ర్మాన్ని త‌గ్గించుకోవాల‌ని మార్కెట్ లో దొరికే క్రీమ్‌లు, మాయిశ్చ‌రైజ‌ర్లు, స్ర్క‌బ్, ఫేస్ వాష్‌లు ట్రై చేసే ఉంటారు. కానీ ఫ‌లితం అంద‌క‌పోగా.. వాటికి పెట్టిన ఖ‌ర్చంతా వృధా అయిపోయిందని ఫీల‌వుతున్నారా ? అయితే నో ప్రాబ్ల‌మ్స్. హోం మేడ్ ఫేస్ వాష్ మీరే స్వ‌యంగా త‌యారు చేసుకుంటే.. జిడ్డు వ‌దిలించుకోవ‌డం ఈజీనే అవుతుంది.  ఫేస్ వాష్ చాలా న్యాచుర‌ల్‌గా ప‌నిచేస్తుంది.

చ‌ర్మంపై ఆయిల్‌ని మిరాకిలిస్‌గా త‌గ్గిస్తుంది. అలాగే చ‌ర్మం పొడిబార‌కుండా కాపాడుతుంది.  ఐస్‌కు చర్మాన్ని బిగుతుగా ఉంచే గుణం ఉంటుంది. అంతేకాక పెద్దగా ఉన్న చర్మ రంద్రాలను చిన్నవిగా చేస్తుంది. అలాగే ముఖంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. మొదట మీరు  ముఖాన్ని బాగా కడిగి, ఆ తర్వాత కొన్ని ఐస్‌ ముక్కలను పలచటి గుడ్డలో వేసి సాగిన చర్మ రంధ్రాల దగ్గర కొన్ని సెకన్ల పాటు అలాగే ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల ముఖం మీద చర్మం బిగుతుగా తయారవుతుంది.


ఆయిల్ స్కిన్ కనబడకుండా పాటించాల్సిన చిట్కాలు :


ముఖం మీదున్న జిడ్డును  పోగొట్టడంలో టొమాటో జ్యూస్‌ చాలా  బాగా పనిచేస్తుంది. ఇది చర్మంలోని సూక్ష్మరంధ్రాలను శుభ్రం చేయడమే కాకుండా అవి ముడుచుకుపోయేలా చేస్తుంది. అందుకే టొమాటో జ్యూసు లేదా టొమాటో గుజ్జును ముఖం మీద రాసుకోని ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. టమోటా మంచి క్లెన్సర్ గా పనిచేస్తుంది. 


బేకింగ్ సోడాలో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ల్ఫ‌మేట‌రీ, క్లెన్సింగ్, న్యూట్ర‌లైజింగ్ గుణాలుంటాయి. ఇవి జిడ్డు చ‌ర్మానికి, మొటిమ‌ల‌ను తొల‌గించడంలో ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తాయి.


 
తేనె చ‌ర్మాన్ని స్మూత్‌గా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ ఇన్ల్ఫ‌మేట‌రీ గుణాలు.. మొటిమ‌లు, ఇన్ఫెక్ష‌న్‌ల‌కు కార‌ణ‌మ‌య్యే బ్యాక్టీరియాతో పోరాడ‌తాయి. 


ప‌సుపు ప‌సుపులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ల్ఫ‌మేట‌రీ, యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు మెండుగా ఉంటాయి. అలాగే ర‌క‌ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో పోరాడే స‌త్తా ప‌సుపులో ఉంటుంది. అలాగే చ‌ర్మాన్ని కాంతివంతంగా మార్చ‌డంలోనూ ప‌సుపు ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తుంది.  


చ‌ర్మాన్ని గోరువెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒక టీ స్పూన్ తేనె, చిటికెడు ప‌సుపు, అర టీ స్పూన్ బేకింగ్ సోడా అర‌చేతిలో వేసుకోవాలి. వీటన్నింటినీ రెండు చేతుల‌తో మొఖంపై బాగా రుద్దాలి. సర్కుల‌ర్ మోష‌న్ లో 2 నిమిషాల పాటు స్క్ర‌బ్ చేయాలి. ఎక్కువ ఆయిలీగా అనిపించే ప్రాంతంలో ఎక్కువ‌గా రుద్దుకోవాలి. త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే హోంమేడ్ ఫేస్ వాష్ అయిపోతుంది. చాలా సింపుల్ గా ఉన్న ఈ టిప్ ట్రై చేస్తారు క‌దూ.. 


మరింత సమాచారం తెలుసుకోండి: