ప్రతీ ఒక్కరూ తమకి అందమైన జుట్టు కావాలని కోరుకుంటారు..ఎన్నో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వారి ప్రయత్నాలు మాత్రం సత్ఫలితాలు ఇవ్వవు..సహజసిద్దమైన విధానాల వలనే జుట్టుకు సంరక్షణ చేకూరుతుంది తప్ప రసాయనిక క్రీములు ..జెల్లీ లు రాసుకోవడం వలన ఉపయోగం లేకపోగా ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది..అందుకే పూర్వం నుంచీ మనవాళ్ళు వాడే సహజసిద్దమైన పద్దతుల ద్వారా జుట్టుని ఎంతో కాంతివంతంగా బలంగా చేసుకోవచ్చు..

 Image result for aloe vera hair benefits

కలబంద ద్వారా మీ కురులని ఎంతో ధృడంగా చేసుకోవచ్చు కలబంద మీ చెంత ఉంటే అందమైన కురులు మీ సొంతం అయినట్టే.. కలబంద లో సుమారు  100 కి పైగా సూక్ష్మపోషకాలున్నట్లుగా పరిసోధనల్లో తేలింది..కబందని అన్ని సౌందర్య సాధనాలలో జుట్టు సంరక్షణ షాంపూలలో..హెయిర్ ఆయిల్ లలో వాడుతూ ఉంటారు..కలబంద తలపై ఉండే కుదుళ్ళని  గట్టిగా పట్టి ఉంచుతుంది..

 Image result for aloe vera hair benefits

కలబందలోని  ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ మాడుపై పాడైన కణాలను బాగుచేస్తాయి...ఇది కుదుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి త్వరగా జుట్టుపెరిగేలా చేస్తుంది...అంతేకాదు కలబంద ని జుట్టుకి రాయటం వలన జుట్టు వెంటనే మృదువుగా..మెత్తగా మారుతుంది. మృదువైన జుట్టుతో హెయిర్ స్టైలింగ్ సులభమౌతుంది,..జుట్టును వదులుగా కూడా ఉంచుకోవచ్చు...జుట్టు ఊడిపోవటం ఆగిపోవాలి అంటే సహజంగా ఒత్తైన జుట్టు పెరగటానికి దీన్ని వాడటం మంచిది...దీనిలోని ఫంగల్ వ్యతిరేక లక్షణం చుండ్రును పొట్టుగా ఊడిపోవటాన్ని నివారించి నయం చేస్తుంది.
Image result for aloe vera hair benefits
అయితే కలబంద ని ఉపయోగించి దాన్ని జుట్టుకి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..ముందుగా సమాన పరిమాణాల్లో కొబ్బరినూనె , ఆలోవెరాను కలపటం వలన మ్యాజిక్ ప్యాక్ తయారవుతుంది. ఇలా బలమైన, మృదువైన, ఒత్తైన జుట్టు వస్తుంది.వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ను రాసుకుని ఎంతసేపైతే అంత వదిలేయండి. ఈ మిశ్రమాన్ని మీ తలపై నెమ్మదిగా మసాజ్ చేస్తూ చివర్ల వరకూ రాయండి..సరిగ్గా తల అంతా పట్టించాక  షవర్ క్యాప్ పెట్టుకొని ఒక గంట అలా వదిలేశాక కడిగేయండి. కొన్ని రోజుల తరువాత మీరు ఎంతో ఒత్తయిన, మృదువుగా ఉండే జుట్టుని చూస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: