అందం ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందంగా కనిపిస్తే సొసైటీలో ఓ గౌరవం ఉంటుంది. అందంగా ఉండే వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే స్టార్స్ అందంగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. రాత్రిపూట పడుకోబోయే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే.. మీ అందం మరింతగా పెరుగుతుంది. మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దామా.
వీకెండ్స్ లో బాగా తిరిగితిరిగి అలిసిపోయి వచ్చి అలాగే పడుకుంటారు. అలా కాకుండా.. సహజవంతమైన క్రీమ్ ను పేస్ కు అప్లై చేసి నిద్రపోతే మీ అందం మరింత నిగారిస్తుంది.
కొంతమందికి రాత్రిపూట సరిగా నిద్రపోరు. అలాంటి వ్యక్తుల చర్మం పొడిబారిపోతుంది. అలాంటి వాళ్ళు రాత్రిపూట పడుకునే ముందు కాసిన్ని కొబ్బరినీళ్లు తాగితే మంచిది. అలాగే ఎనర్జీ డ్రింక్స్, కాఫీ, చెక్కరతో కూడిన డ్రింక్స్ తీసుకోకూడదు.
బయట నుంచి వచ్చిన తరువాత పేస్ మేకప్ ను పూర్తిగా తీసెయ్యాలి. చల్లని నీటితో పేస్ ను క్లీన్ చేసుకోవాలి. ఆలా చేయడం వలన మంచి నిద్ర పడుతుంది. అందం మీ సొంతం అవుతుంది.
అలాగే తలగడ లేకుండా పడుకోవాలి. ఆలా చేయడం వలన పేస్ కు బ్లడ్ సరఫరా జరుగుతుంది ఫలితంగా మంచి నిద్ర, అందం మీ సొంతం అవుతుంది.