ఎంతో మంది అమ్మాయిలు అందంగా ఉండాలి అనుకుంటుంటారు. అయితే ఆలా అనుకున్నట్టే అందంగా కూడా ఉంటారు. కానీ అంత అందంగా మెయింటైన్ చేసిన సరే కొంతమంది గోళ్లు అందంగా ఉండవు. అందం గురించి పక్కన పెట్టండి. అసలు గోళ్లు అనేవి ఉండవు. ఎందుకంటే కొంతమందికి బాగా పెరుగుతాయి కానీ వాళ్లకు గోళ్లు నోటిలో పెట్టుకునే అలవాటు ఉంటుంది.
మరి కొందరికి పెరిగినప్పటికీ చేస్తున్న పని వల్ల ఉనన్ గోళ్లు కాస్తా పుటుక్కుమని విరిగిపోతాయి. ఆలా అన్ని అయినా విరగవు. అయుదు వేళ్ళకు ఉన్న ఒక్క వేలి గోర్లు విరిగిపోతాయి. అయితే అలాంటి వారు ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలా జాగ్రత్తలు తీసుకుంటే గోర్లు ఆరోగ్యంగా అందంగా ఉంటాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
మన గోళ్లు, వాటి చుట్టున్న చర్మం శుభ్రంగా ఉండాలి. నెయిల్ పాలిష్‌ను తొలగించేందుకు అసిటోన్ లేనట్టి నెయిల్ పాలిష్ రిమూవర్ వాడాలి. టూత్‌బ్రష్‌కు కొద్దిగా సబ్బురుద్ది, దాంతో గోళ్లు, చుట్టున్న చర్మాన్ని రుద్దాలి. ఇలా చెయ్యడం ద్వారా గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి.
సబ్బు లేదా నీళ్లతో నెయిల్ కిట్‌ను శుభ్రం చేసి, రబ్బింగ్ ఆల్కహాల్‌తో తుడవాలి. ఇలాచేస్తే నెయిల్‌కిట్ మీదున్న సూక్ష్మక్రిములు అన్ని తొలగిపోతాయి.
నెయిల్ పాలిష్ వేసుకునే ముందు బేస్‌కోట్ తప్పనిసరి ఉపయోగించాలి. గోళ్లకు రాత్రిపూట బాదం నూనె రాస్తే, తేమ అంది, ఆరోగ్యంగా ఉంటుంది.
చూశారుగా ఈ చిట్కాలు పాటించి మీ గోర్లను ఆరోగ్యంగా అందంగా జాగ్రత్తగా కాపాడుకోండి.