అలొవెరా పల్లెల్లో ప్రతి ఇంటి వద్ద ఉండే చెట్టు ఇది. ఈ అలొవెరాతో ఎంతో అందం సొంతమవుతుంది. అలొవెరా వల్ల అందం, ఆరోగ్యం రెండు సొంతమవుతాయి. అలొవెరా వల్ల చర్మసంరక్షణ ఎంతో ఉంటుంది. అయితే అలొవెరాతో అందం ఎలా సొంతమవుతుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి..
అలొవెరా జెల్ తలకు రాసుకుంటే జుట్టు బాగా వత్తుగా పెరుగుతాయి.
అలొవెరా జెల్‌వేసి గడ్డ కట్టించి సూర్య రశ్మిలో బాగా తిరిగినప్పుడు, ఏవైనా పురుగుల్లాంటివి కుట్టినప్పుడు ఈ అలొవెరా క్యూబ్స్ చర్మంపై బాగా పనిచేస్తాయి.
చుండ్రు ఉంటే కాస్త నిమ్మరసంలో అలొవెరా గుజ్జును కలిపి ఆ మాస్కును జుట్టుకు బాగా పట్టించాలి. ఇలా చెయ్యడం వల్ల జుట్టు వత్తుగా పెరుగుతుంది.
మొటిమలు, యాక్నే మచ్చలుంటే రాత్రి పడుకోబోయే ముందు వాటిపై అలొవెరా జెల్‌ని రాసి రాత్రంతా ఉంచుకుని పొద్దున్నే చల్లటి నీళ్లతో కడుక్కోవాలి.
శరీరంపై ఉన్న మచ్చలపై అలొవెరా జెల్ ఎంతో శక్తిమంతంగా పనిచేస్తుంది.
దెబ్బతిన్న చర్మంపై రోజూ అలొవెరా జెల్ రాసి మసాజ్ చేస్తే మంచిది.
పాదాలపై ఏర్పడ్డ పగుళ్లను అలొవెరా జెల్ పోగొడుతుంది, పాదాల చర్మాన్ని ఎంతో మృదువుగా చేస్తుంది.
అలొవెరాతో ముఖంపై ఏర్పడ్డ ముడతల పోతాయి. చర్మం సాగే గుణాన్ని పెంచుతుంది, చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
కళ్ల కింద ఉండే నల్లటి వలయాలను అలొవెరా జెల్ తగ్గిస్తుంది.
చూశారుగా ఎన్ని లాభాలూ ఉన్నాయో.. మరి ఇంకెందుకు ఆలస్యం అలొవెరాని ఉపయోగించి మీ చర్మాన్ని, జుట్టుని కాపాడుకోండి.