సాధారణంగా అందంగా కనిపించాలని ప్రతిఒక్కరికి ఉంటుంది. ఇందుకోసం ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఎన్నో కెమికల్ ప్రోడెక్ట్స్ కూడా వాడుతుంటారు. వాస్తవానికి అందంగా కనిపించాలంటే అది చర్మం మీద ఆధారపడి ఉంటుంది. సరైన ఆరోగ్య, ఆహార నియామాలు పాటించకపోవడం వల్లే చర్మం నిగారింపు లేక కళతప్పి కనిపిస్తుంది. అయితే కేవలం కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా స్కిన్ గ్లో అవుతుంది. అవును! చర్మం నిగారింపు పైపై పూతలతో రాదు. ఖరీదైన క్రీములతో వెలిగిపోదు.
కాలానుగుణంగా వాతావరణంలో జరిగే మార్పులను తట్టుకుంటూ చర్మం జీవకళతో నవనవలాడాలంటే మనం రోజూ తినే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మరి ఏం తింటే స్కిన్ గ్లో అవుతుంది..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకి నాలుగు నుండి ఆరు బాదం పప్పులు ఎవరైతే తింటారో వారి స్కిన్ అందంగా తయారవుతుంది. అలాగే రోజూ ఒక గుడ్డును తీసుకుంటే చర్మానికి మంచిది.
అదేవిధంగా, ఇప్పుడు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్‌కు అలవాటు పడి పండ్లు తినడం మానేసారు. వాస్తవానికి పండ్లు తినేవాళ్ళ స్కిన్ గ్లో ఎక్కువగా ఉంటుంది. ఇక కూరగాయల విషయానికి వస్తే వీటిని పూర్తిగా ఎవరు తినట్లేదు. ముఖ్యంగా క్యారెట్, కీరా. వీటిని తినటం వలన విటమిన్ సి మనకు లభిస్తుంది. ఇది స్కిన్ గ్లో కోసం ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. మరియు తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా తాజాగా ఉంటుంది.