అరటిపండు.. రుచిగా ఉండే ఈ పండును ఇష్టపడని వారు చాలా అరుదు. అరటి పండు తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం మనకు రోజంతా ఎనర్జీని ఇస్తుంది. రోజూ అరటిపండ్లు తింటే మానసికంగా కూడా బలంగా ఉండగలుగుతారు. జ్ఞాపకశక్తి పెరిగేందుకు అరటిపండ్లు బాగా యూజ్ అవుతాయి. అరటి పండ్లను తీసుకోవడం వల్ల హార్ట్‌అటాక్ వల్ల సంభవించే మరణాలు తగ్గుతాయి. అరటిపండులో ఉండే మగ్నీషియమ్.. వ్యధినిరోధక శక్తిని మెరుగుపరిచి మనల్ని ఎంతో యాక్టీవ్‌గా ఉండేందుకు తోడ్పాటునిస్తుంది. ఇక అరటిపండ్లు చర్మానికి ఉపయోగపడతాయని మనందరికీ తెలిసిందే.
అయితే అరటిపండు జుట్టు సంరక్షణలో కూడా ఎంతో చక్కగా సహాయపడతాయి. మరి పండు శిరోజాలకు ఎలా యూజ్ చేయాలి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అందుకు ముందుగా.. అరటిపండు పేస్ట్ మరియు కొబ్బరి నూనె బాగా మిక్స్ చేసి.. ఆ మిశ్రమాన్ని తలకు అప్లై చేసుకోవాలి. అర గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ అరటి హెయిర్ మాస్క్స్ జుట్టు సంరక్షణకు బాగా ఉపయోగపడతాయి. దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడానికి అరటిపండ్లలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి.
అలాగే అరటిపండు పేస్ట్‌లో కొద్దిగా పెరుగు మరియు రోజ్‌వాటర్ వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తల బాగా పట్టించి గంట సేప అలా వదిలేయాలి. గంట అయ్యాక తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు చివర్లలో ఏర్పడే పగుళ్ళను కూడా నివారించడంతో పాటు శిరోజాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మరియు అరటిపండు పేస్ట్‌లో కొద్దిగా పెరుగు మరియు నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తల బాగా పట్టించి గంట సేప అలా వదిలేయాలి. గంట అయ్యాక తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. కాబట్టి ఈ టిప్స్‌ను తప్పకుండా యూజ్ చేయండి.