అందం.. ప్రతి ఒక్కరికి అవసరమైనది. అందమైన అందం మన సొంతం కావాలి అంటే కొన్ని అద్భుతమైన చిట్కాలు పాటించాలి. అప్పుడే అందాన్ని మన సొంతం చేసుకోగలం. ఇంకా అలాంటి అందం కోసం కొన్ని అద్భుతమైన చిట్కాలు పాటించండి.. అందంగా మెరిసిపోండి. ఆ చిట్కాలు ఏంటో ఓ సారి ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ముఖంపై ముడతలు, నల్లని మచ్చలు తగ్గాలి అంటే బొప్పాయిపండు గుజ్జుని కళ్ళకి తగలకుండా ముడతలు, మచ్చల మీద రాసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగితే ముడతలు ,నల్ల మచ్చలు మాయం అవుతాయి. 

 

ముఖం ఎండకు కమిలిపోతే పచ్చి శనగపప్పు రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం కాస్త పసుపు కలిపి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి పట్టిస్తే చర్మం నిగనిగలాడుతోంది. 

 

తులసి ఆకుల గుజ్జును నిద్రకు ముందు ముఖానికి పట్టించి ఉదయం లేవగానే చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. 

 

మొటిమల సమస్య ఎక్కువ ఉంటే పెరుగులో కొద్దిగా శనగపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకోవాలి. అనంతరం చల్లటి నీటితో ముఖం కడిగితే మొటిమలు మాయం అవుతాయి. 

 

మొటిమల కోసం పండిన టమాటా, వెల్లులి లేదా పుదీనా రసం పట్టించి గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు మాయం అవుతాయి. 

 

పెరుగు, గోరింటాకు, గుడ్డు తెల్లసొన కలిపి రాత్రంతా నాననిచ్చి ఉదయాన తలకు పట్టించి అరకా ఆయుర్వేదిక్ షాంపూతో స్నానం చేస్తే చుండ్రు మాయం అవుతుంది. 

 

నిర్జీవంగా ఉంది రాలుతున్న జుట్టుకు ఎండు సీతాఫలం గింజల పొడి కలిపి కొబ్బరి నూనె రాస్తే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

 

చూశారుగా ఈ చిట్కాలు పాటించి అద్భుతమైన అందాన్ని మీ సొంతం చేసుకోండి.                  

మరింత సమాచారం తెలుసుకోండి: