ఒకప్పుడు జడ అంటే చాలా మందికి ఒక క్రేజ్ ఉండేది. జడ అంటే బారెడు ఉండేది. మా అమ్మాయి జడ చూసావా అక్కా, మా అమ్మాయి జడ చూసావా వదినా అంటూ ఎంతో గొప్పగా చెప్తూ ఉండే వారు. ఇప్పుడు జడ చూడాలి అంటే ఏ మీరా షాంపూ యాడ్ లోనే కనపడుతుంది గాని ఎక్కడా కూడా జడ అనేది లేదు. ఉన్నా సరే బెత్తెడు ఉంటుంది అంటూ చాలా మంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం ప్రభావం ఒకటి అయితే సోకులు పెరగడం మరో కారణం. గతంలో అమ్మలకు మంచి జడ ఉంటే అమ్మాయిలు కాస్త ఫ్యాషన్ గా చూసే వారు.


కాని ఇప్పుడు అమ్మలకు కూడా ఫ్యాషన్ పెరగడంతో జడ టీవీ లో తప్ప రియల్ లైఫ్ లో కనపడి చావట్లేదు.  అది అంతా ఒక బ్యాచ్ అయితే మరో బ్యాచ్ కూడా ఉంది. జడను అమితంగా ప్రేమించే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వీళ్ళకు జడ ఊడిపోతుంటే నరకం అనుకోండి. చెప్పుకోలేరు, ఏడవలేరు అన్నట్టు ఉంటుంది. మరి అలాంటి వారు ఏం చేయాలో చెప్తా చూడండి. పొడవాటి జుట్టు ఉండాలని కోరుకునేవారు ఇంట్లోనే సింపుల్‌గా ఈ హెయిర్‌ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు అన్నమాట. అది చాలా చాలా సింపుల్. ప్రాణాలతో  పోరాటం కాదు సుమా...


కొబ్బరి నూనె, దాల్చిన చెక్క నూనెలను సమపాళ్లలో తీసుకుని రెండు బాగా కలుపుకొండి. ఈ మిశ్రమాన్ని  తలకు జుట్టుకు బాగా పట్టించండి, అరగంట పాటు అలాగే ఉంచుకోవాలన్న మాట. ఆ తరువాత మామూలు షాంపూతో కడిగేయండి.  లేదు అనుకుంటే కండిషనర్ ఉపయోగించండి.  ‌ ఇలా చేయడంతో జుట్టుకి చాలా మంచి పోషకాలు అందుతూ ఉంటాయి. అప్పుడు జుట్టు కూడా చాలా బలంగా పెరుగుతుంది. చిన్న పిల్లలకు ఇప్పటి నుంచే చేసుకుంటే మంచిది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: