
ఆముదం వాడకం వల్ల కడుపు శుద్ది జరిగి మలబద్దకాన్ని తరిమి కొడుతుంది. ఇంకా కడుపు నొప్పి, తల నొప్పికి మంచి మందులా పని చేస్తుంది. రోజూ పడుకునే ముందు రెండు స్పూన్ల ఆముదం తాగితే మూత్రాశయం శుభ్రపడి మూత్ర పిండాలలో రాళ్ళను కరిగిస్తుంది. ఆముదం కొబ్బరి నూనె కలిపి అరికాళ్లకు మర్దన చేస్తే అరికాళ్ళ మంటలు తగ్గు ముఖం పడతాయి. ఇంకా పాదాలు మృదువుగా ఉంటాయి. కళ్ళు ఎర్రబడి పుసులు కడుతుంటే రెండు చుక్కలు ఆముదం కంటిలో వేస్తే మంచి మందుగా పని చేస్తుంది. ఆముదాన్ని ప్రతి రోజు తలకు రాసుకుంటే జుట్టు నల్లగా, ఏపుగా పెరుగుతుంది. తలలో చుండ్రు సమస్య కూడా నివారించబడుతుంది. ఆముదం మాత్రమే కాక ఆ చెట్టు యొక్క ఆకులు, వేర్లు కూడా అనేక రకాల చికిత్సలలో వాడతారు.
వేసవి కాలంలో ఆముదపు ఆకులను తల మీద వేసి కట్టుకుంటే వడ దెబ్బ నుండి కాపాడుకోవచ్చు. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఆముదపాకులను వెచ్చచేసి కాపడం పెడితే నొప్పులు మాయం అవుతాయి. చంటి పిల్లలకు ఆముదపు ఆకులను వెచ్చ చేసి పొట్ట పై కాపడం పెడితే పొట్టనొప్పి తగ్గుతుంది. ఆముదపు ఆకులు వేడి చేసి బాలింతలు రొమ్ములపై కాపడం పెడితే పాలు సమృద్దిగా ఉత్పత్తి అవుతాయి. పంటి నొప్పికి ఆముదం వేర్లు మెత్తగా నూరి దంతాలపై పెడితే పంటి నొప్పి తగ్గుతుంది.