ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి. బెల్లాన్ని పౌడర్ లా మార్చేవరకు గ్రైండ్ చేసి... ఆ తరువాత ఒక బౌల్ లోకి బెల్లం పౌడర్ ను తీసుకుని మధ్యలో కాస్త కాళీ చేసి అందులో లవంగాలు పెట్టండి. ఇప్పుడు ఇంకొక బవుల్ ను వీటిపైన ఉంచి వీటిని గ్యాస్ స్టవ్ పై పెట్టి వేడి ఎక్కే వరకు ఉంచండి. దాదాపు 10 నిమిషాల్లో ఆవిరి రావడాన్ని గమనించిన తర్వాత ఇది వాటర్ గా మారుతుంది. ఇప్పుడు ఈ వాటరీ మిక్స్ కు కాస్త హెన్నా కలపండి. దీన్ని నెయిల్స్ కు కోటింగ్ గా అప్లై చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత నెయిల్ కోట్ గా ఈ మిశ్రమాన్ని వాడుకోండి.
కాటన్ బాల్ ను ఉపయోగించి నెయిల్ కోట్ అప్లై చేయండి. ఇది బయట కొనే దాని కంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ నేచురల్ నెయిల్ పెయింట్ కనీసం రెండు వారాల పాటు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. దాని అంతట అదే ఒక్కసారిగా పోయే అవకాశం ఉంటుంది. బెల్లం, లవంగాలు అలాగే హెన్నా వంటివి నెయిల్స్ ను ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడి నెయిల్స్ ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. చాలా ఆకర్షనీయంగా కూడా ఇది కనపడుతుంది. హెన్నా మీ నెయిల్స్ కు అదనపు అందం తీసుకొస్తుందని ఇది ట్రై చేసిన వాళ్ళు చెప్తున్నారు.