ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ బ్యూటీ ఆర్టికల్ చదవండి.. చర్మ సంరక్షణ కోసం, ఫేస్ మాస్క్‌లు, మాయిశ్చరైజర్ల ద్వారా చర్మాన్ని కాపాడుకోవాలి. మీ చర్మాన్ని రక్షించే హైడ్రేటింగ్ పదార్ధాలతో మీ ఫేస్ మాస్క్ లు తయారయ్యేలా చూడటం చాలా ముఖ్యం.

కాఫీ పొడి, బియ్యపు పిండి మరియు కొబ్బరి నూనెలను కలిపితే శక్తివంతమైన ఎక్స్‌ఫోలియేషన్ పీల్ తయారవుతుంది. ఇది చర్మం బిగుతుగా ఉండేట్లు చేస్తుంది. కొబ్బరి నూనెలో ఫాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది చర్మం యొక్క హైడ్రేషన్ మీద పనిచేస్తుంది. కాఫీలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, కాఫీ చర్మం యొక్క ఎలాస్టిసిటీ ని పెంచుతుంది. ఇవి త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. కాఫీ రక్త ప్రసరణను పెంచుతుంది. దీని వల్ల ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. బియ్యపు పిండి సూపర్ మార్కెట్లలో సులభంగా లభిస్తుంది. చర్మం యొక్క దృఢత్వంపై పనిచేస్తుంది. బియ్యపు పిండి చర్మంలో పేరుకుపోయిన అదనపు ఆయిల్స్‌ను తొలగించి మొటిమలు రాకుండా చేస్తుంది.

పొడిబారిన, పగిలిన చర్మం కోసం: షియా బటర్, బాదం నూనె, చమోమిలే, గంధం, పాల్మా రోసాలను వాడండి....

జిడ్డు, మొటిమల బారినపడే చర్మం కోసం: టీ ట్రీ, తులసి, నిమ్మ, మోనోయి ఆయిల్, మ్యాంగో బటర్, రాస్‌బెర్రీ సీడ్ ఆయిల్, థైమ్, చార్‌కోల్ లను వాడండి....
 
సున్నితమైన చర్మం కోసం: సహజ గ్లూకాన్ గమ్, లావెండర్, నెరోలి, జెరేనియం లను వాడండి.....

ముడతలు పడిన చర్మం కోసం: కొల్లాజెన్, ప్లాంట్ పెప్టైడ్స్, అర్గాన్, పాల్మా రోసా, గంధం, ప్యాచౌలి, సైప్రస్, మిర్రర్ లను వాడండి.....

శుభ్రపరిచే ఎక్స్‌ఫోలియేషన్, పీల్స్ చర్మంలో కొత్త మార్పులు కలగిస్తాయి. చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఎక్స్‌ఫోలియేషన్ సహాయపడుతుంది. స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్‌ను ముఖం, శరీరం మొత్తానికి వారానికి రెండుసార్లు చేయాలి. ఇది చనిపోయిన కణాలను తొలగిస్తుంది, చర్మాన్ని డేటాక్సిఫై చేస్తుంది. ఇలాంటి మరెన్నో బ్యూటీ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి: