
ఈ ఇంటి చిట్కాలను పాటించడం వలన మీ ముఖం తెల్లగా నిగ నిగ లాడిపోతుంది.
రెండు టేబుల్ స్పూన్స్ తాజా పెరుగు మరియు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను తీసుకుని ఈ రెండిటినీ బాగా కలిపి ముఖానికి సున్నితంగా ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకుంటే ముడతలు రావు. ఫైన్ లైన్స్ తగ్గిపోతాయి. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖంపై కనీసం గంటపాటు ఉంచుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.
ఒక టీస్పూన్ శనగపిండి తీసుకోండి. అందులో రెండు టీస్పూన్ల ఓట్ మీల్ పౌడర్ ను కలపండి. అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కలపండి. వీటిని బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోండి. పదిహేను నిమిషాల తరువాత ఫేస్ వాష్ చేసుకోండి.
రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు, మ్యాష్ చేసిన అరటిపండు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ ను తీసుకోండి. ఇప్పుడు, ఈ ఫేస్ ప్యాక్ ను ముఖం అలాగే మెడపై అప్లై చేయండి. ఇలా ప్రతి రోజూ చేయండి. ఎందుకంటే, రెగ్యులర్ గా ఈ ప్రాసెస్ ను ఫాలో ఐతే ముఖమనేది నేచురల్ గా గ్లో అవుతుంది.
రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె అలాగే ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని తీసుకోండి. వీటిని పేస్ట్ లా చేసుకుని ముఖం అలాగే మెడపై మసాజ్ చేసుకోండి. పదిహేను నిమిషాల తరువాత వాష్ చేసుకోండి.
ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...