
పంచదార... పంచదార బరువు పెరగడానికే కాదు, మొటిమలు రావడానికి కూడా కారణమౌతుంది. పంచదార ఎక్కువ తీసుకోవడం వల్ల స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది, కొలాజెన్ ఫార్మ్ అవ్వకుండా ఆగిపోతుంది. దానివల్ల వచ్చే ఒక ఫలితం వయసు మీద పడినట్లుగా కనిపించడం. ఐస్ క్రీంస్, చాక్లేట్స్, బాటిల్డ్ స్మూతీస్, జామ్ వంటివి తగ్గించి తీసుకుంటే ఈ సమస్యకి చెక్ పెట్టవచ్చు.
కాఫీ... కాఫీ వల్ల చర్మం తొందరగా సాగిపోతుంది. ముడతలు పడి పోతాయి. కాఫీని రోజుకి రెండు సార్లు కంటే ఎక్కువ త్రాగొద్దు. మంచి నీరు ఎక్కువ తీసుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా ఉంటుంది.
పాలు... పాలు స్కిన్ ఇరిటేషన్ కి కారణమవుతాయి. స్వెల్లింగ్ కూడా రావచ్చు. ఆల్మండ్, లేదా ఆర్గానిక్ మిల్క్ వలన ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చు.