ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మొటిమలతో బాధపడుతున్నారా? అయితే ఈ పద్ధతులు పాటించండి.లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి.. అంటే  నీరు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. నీరు అధికంగా ఉండే పండ్లు ఇంకా  కూరగాయలు తినడం వలన మొటిమలు మచ్చలు సమస్య రాదు. అలాగే యోగ, వ్యాయామం ద్వారా మీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోండి. వీలైనంతవరకు  ఒత్తిడి ఇంకా శ్రమను తగ్గించుకోండి. ఇవి తగ్గించడం ద్వారా మీ మనస్సును ప్రశాంతంగా ఉంటుంది. ఇక మీ చర్మానికి అవసరమైనపుడు ట్రీట్మెంట్ చేయించి చర్మాన్ని కాపాడండి. ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే ఇవన్నీ పాటించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మీ చర్మంలో మార్పులు వస్తాయి. ఆ మార్పులకు తగినట్లుగా మీరు మీ చర్మాన్ని ఎప్పటికప్పుడు  సంరక్షించుకోవాలి.

మజ్జిగ, బాదంపాలు ఇంకా లస్సి అలాగే నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు అన్నీ చర్మంకు మేలు చేస్తాయి. ఎందుకంటే మీరు నీటితో కూడిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు, మీ చర్మం లోపలి నుండి ఎక్కువసేపు హైడ్రేట్ గా ఉంటుంది. ఆపిల్, కీర దోసకాయలు, ద్రాక్ష మొదలైనవి తినండి. పుచ్చకాయ ఇంకా  గులాబీ రంగులో ఉండే ద్రాక్షపండులో కూడా ఇంటర్నల్ ఎస్ పీ ఎఫ్ ఇంకా  సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడే లక్షణాలు కలిగి ఉంటాయి.ఈ ఆహారాలు మొటిమలు రాకుండా మీ చర్మాన్ని కాపాడుతాయి.

మొబైల్స్ ని ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు వాటి నుండి వెలువడే నీలి రంగు లైట్ మీపై పడకుండా ఉండటం కోసం అద్దాలు ధరించడం వంటి చిన్న మార్పులు చేయండి.మొబైల్స్ మీద క్రిములు ఎక్కువగా ఉంటాయి. మీరు మొబైల్ ని తాకినప్పుడు అవి మీ చర్మం పైకి వస్తాయి. అందువల్ల మొటిమలు వస్తాయి. కాబట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువ వాడవద్దు. రెగ్యులర్ విరామం తీసుకోవడానికి టైమర్‌లను సెట్ చేసుకోండి ఇంకా ఆ విరామాలను పెంచడానికి ప్రయత్నించండి. బ్లూ లైట్ ఇంకా  పర్యావరణ సమస్యలను చురుకుగా ఎదుర్కోవడంలో సహాయపడే మంచి ఉత్పత్తులను కూడా మీరు ఉపయోగించవచ్చు.ఇక ఇలాంటి ఎన్నో సౌందర్య చిట్కాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: