ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు తెల్లబడిపోతుంది. ఇందుకు కారణం మనం తీసుకునే ఆహారంలో విటమిన్,పోషకాల లోపం.చిన్న వయసులో జుట్టు తెల్లబడిపోవడం వల్ల నలుగురిలో తిరగడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలా తెల్లబడిపోయిన జుట్టును నల్లగా మార్చడానికి, ఎంతో ఖర్చు పెడుతూ,మార్కెట్లో దొరికే ఎన్నోరకాలైన హెయిర్ కలర్స్ ను తెచ్చి వాడుతుంటారు.హెయిర్ కలర్స్ తాత్కాలిక రంగులు మాత్రమే ఇవ్వగలవు. కానీ వీటిని వాడడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు ఎదురవుతున్నాయి.  తలనొప్పి,  క్రమంగా కంటి చూపు తగ్గిపోవడంలాంటి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి.

అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇప్పుడు మనం చర్చించుకోబోయే చిట్కా పాటించి మీ తెల్లని జుట్టు కు శాశ్వత పరిష్కారం చూపించండి.సాధారణంగా వెల్లుల్లి తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్ని  ప్రయోజనాలు కలుగుతాయో అందరికి తెలుసు. వెల్లుల్లి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల జలుబు,దగ్గు,ఆస్తమా, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది ఇలాంటి సమస్యలను అరికడుతుంది.  అంతేకాకుండా ఎన్నో రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది.

అన్ని వ్యాధులకు ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి వెల్లుల్లి మాత్రమే ఉపయోగించుకొని,వెల్లుల్లి పొట్టును పడేస్తుంటాము. వెల్లుల్లి పొట్టును వాడి తెల్లని జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. అయితే వెల్లుల్లి పొట్టును ఎప్పటికప్పుడు దాచి పెడుతూ ఉండండి. ఇలా దాచిపెట్టిన వెల్లుల్లి పొట్టును తీసి అందులో ఉన్న పుల్లలు వేర్లు  లాంటివి తీసి పడేయండి.ఇప్పుడు ఆన్ చేసి ఒక పెనం పెట్టి, అందులో ఈ వెల్లుల్లి పొట్టును వేసి బాగా నల్లగా అయ్యేవరకు వేయించాలి. ఇది అలా వేయడానికి సుమారు 20 నిమిషాల సమయం పడుతుంది.

ఇప్పుడు ఆ పొట్టు ని  తీసి జార్లో వేసి బాగా మెత్తగా బ్లెండ్ చేయాలి.ఇప్పుడు ఆ పౌడర్ ను తీసుకొని ఒక గాజు డబ్బాలో నిల్వ ఉంచుకోవచ్చు. మూడు స్పూన్ల పౌడర్కు రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలిపి, జుట్టుకు బ్రష్ తో  అప్లై చేసుకోవచ్చు.  అప్లై చేసి ఒక గంట పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే, అచ్చం కలర్ వేసుకున్న జుట్టులాగే కనిపిస్తుంది. అయితే ఈ పద్ధతి నెలకు రెండుసార్లు పాటించడం వల్ల శాశ్వత నలుపు మీ జుట్టుకు వచ్చేస్తుంది.ఈ పద్ధతి పాటించడం వల్ల మనకు ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా ఎటువంటి ఖర్చు లేకుండా మన తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి, ఇదే పద్ధతిని మీకు తెలిసిన వారికి కూడా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: