
చర్మ సంరక్షణ అనగానే ముందుగా గుర్తొచ్చేది ముఖసౌందర్యం. అందాన్ని పెంచుకోవడానికి ఎన్నో రకాల క్రీమ్స్,కాస్మోటిక్స్ వాడుతుంటారు. కానీ చేతులను, కాళ్లను పట్టించుకోవడం మానేస్తుంటారు. వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా చేతులు, కాళ్లపైన ప్రభావం చూపుతాయి. ముఖం పై ఉండే శ్రద్ధ కాళ్లు, చేతులపై ఉండదు. ఫలితంగా చేతులు పొడిబారిపోవడం, గీతలాగా ఏర్పడం వంటివి జరుగుతుంటాయి.
అయితే కొన్ని పద్ధతులు పాటించి, చేతులకు మృదుత్వాన్ని పెంచవచ్చు. ఆ పద్ధతులు ఏంటో మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను వాడి చూడండి. లేజర్ చికిత్సలు చర్మం యొక్క ఉపరితలం పై చేయబడతాయి. అవి నల్ల మచ్చలు, గీతలు,వదులుగా ఉండే చర్మం నుండి బయటకు పోవడానికి సహాయపడుతుంది. హైలురోనిక్ ఆమ్లం కలిగిన ధర్మల్ ఫిల్లర్ ద్వారా ముడతలు తగ్గించుకోవచ్చు. మృదువైన చర్మం కోసం సహజమైన పద్దతులలో లేజర్ ట్రీట్మెంట్ కూడా ఒకటి.
ఇంట్లో వస్తువులను శుభ్రపరుస్తున్నప్పుడు కానీ, రసాయనాలతో ఏదైనా క్లీన్ చేస్తున్నపుడు కానీ గ్లౌజ్ తొడుక్కోవడం మంచిది.సబ్బుల వల్ల,రసాయనాల వల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. అలాంటప్పుడు పొడిగా ఉన్న చేతులకు మాయిశ్చరైజర్ అప్లై చేయడం వలన చర్మం మెత్తగా తయారవుతుంది. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు.
రాత్రిపూట పడుకునే ముందు చేతులకు విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బీ3 గల సీరమ్స్ ను అప్లై చేసుకోవడం మంచిది.కాఫీ పొడి లో కొద్దిగా చక్కెర, కొబ్బరి నూనె కలిపి చేతుల పైన స్క్రబ్ చేయడం వల్ల చర్మం పైన ఉండే నలుపు తొలగిపోయి సహజ రంగు పుంజుకుంటుంది.అలోవెరా జెల్ కు కొద్దిగా తేనె కలిపి చేతులపై అప్లై చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.సమయం వున్నప్పుడు నిమ్మచెక్కతో చేతులపై మృదువుగా మర్దనా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పద్ధతులను పాటించి చేతుల మీద ముడతలు,గీతలు,పోగొట్టుకోవచ్చు.