ముఖంపై అవాంఛిత రోమాలు ఇబ్బంది పెడుతున్నాయా? ఐతే, ఈ సులభమైన హోమ్ రెమెడీస్ తో ఆ ఇబ్బందిని తొలగించుకోండి. మరి అన్వాంటెడ్ హెయిర్ ను ఈజీగా తొలగించే ఆ ఇంటి చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా...?

పసుపు:
పసుపు శరీరపు ఛాయను మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవాంఛిత రోమాల పెరుగుదలను తగ్గిస్తుంది. పసుపు అనేక చర్మ సమస్యలకు అలాగే గాయాలకు మంచి మందు.

మాస్క్ కోసం పసుపును ఎలా వాడాలి?
పసుపును నీళ్ళల్లో కలిపి చిక్కటి పేస్ట్ ను తయారుచేయాలి. దీన్ని ముఖంపై అప్లై చేయాలి. అవాంఛిత రోమాలు ఉన్నచోట అప్లై చేసి కొద్ది నిముషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత పసుపు ఎండిపోగానే వెచ్చటి నీటిలో ముంచిన బట్టతో సున్నితంగా వైప్ చేయాలి. టర్మరిక్ తో పాటు అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి.

శనగపిండి:
అమ్మమ్మల కాలం నుండి శనగపిండి అనేది ఫేస్ ఫ్యాక్స్ లో ముఖ్యమైన ఇంగ్రిడియెంట్ గా పేరొందింది. ఇండియాలోని మహిళలు తమ ఫేస్ ప్యాక్ లో ఎక్కువగా శనగపిండిని అలాగే పసుపును వాడటం జరుగుతుంది. ఈ కాంబినేషన్ అనేది అదనపు హెయిర్ ను ముఖ్యంగా ముఖంపై అవాంఛిత రోమాలను తొలగిస్తుందని అంటారు. చర్మం కూడా స్మూత్ గా మారుతుంది.

మాస్క్ ఎలా తయారుచేయాలి?
సమాన మోతాదులో శనగపిండిని అలాగే పసుపును తీసుకుని కొంత నీటిని జోడించి చిక్కటి పేస్ట్ ను తయారుచేయాలి. ఈ పేస్ట్ ను ముఖంపై అప్లై చేయాలి. ఇది పూర్తిగా ఎండిపోయాక, వెచ్చటి నీటిలో ముంచి శుభ్రమైన బట్టతో వైప్ చేయాలి.

గుడ్లు:
గుడ్ల వల్ల స్కిన్ అలాగే హెయిర్ బెనిఫిట్స్ ఎన్నో అందుతాయి.

మాస్క్ ఎలా తయారుచేయాలి?
ఎగ్ వైట్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పాన్ కార్న్ ఫ్లోర్ ను కలపండి. ఒక టేబుల్ స్పూన్ చక్కెరను కూడా కలపండి. వీటితో స్మూత్ పేస్ట్ ను తయారుచేసి ముఖంపై ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి. ఎండిపోయాక, జాగ్రత్తగా తడిబట్టతో వైప్ చేయండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: