బాదంపప్పు శరీర ఆరోగ్యానికే కదా..! మరి ఫేస్ ప్యాక్ లా ఉపయోగపడుతుందని అంటారేంటి? అనే సందేహం మీలో కలుగుతోందా? అవును.. ఇప్పుడు చెప్పబోయే బాదంపప్పు ఫేస్ ప్యాక్ ద్వారా అందాన్ని ఎలా పెంపొందించుకోవాలి చర్చించుకుందాం.బాదంపప్పు మన శరీరానికి ఎన్నో ప్రోటీన్లను కలిగించి, ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుస్తుందని మనందరికీ తెలిసిందే. కేవలం ఆరోగ్యప్రయోజనాలను అందించడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే బాదంపప్పులు ఎలా చర్మసౌందర్యాన్ని పెంచుతాయో?ఇప్పుడు ఇక్కడ చదువు తెలుసుకుందాం.
ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె,ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం రెండు కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ నూనెను ముఖానికి పట్టించి, ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
వేసవి కాలంలో ఎండ కారణంగా చర్మం కమిలిపోతుంది. ఇందుకోసం నాలుగు బాదం పప్పులను నానబెట్టి తొక్క తీసి పేస్టులాగా చేసుకోవాలి. ఇందుకు వన్ టేబుల్ స్పూన్ గంధం పొడి కలిపి ముఖానికి రాయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.
శీతాకాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే బాదం నూనెకు కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి ముఖానికి మర్దనా చేయాలి.ఇలా చేయడం వల్ల ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది.
పుదీనా ఆకులను పేస్ట్ చేసుకుని,అందులో కొద్దిగా బాదం నూనె కలిపి ముఖానికి రాయడం వల్ల ముఖం ప్రకాశవంతంగా కాంతులీనుతుంది.
జిడ్డు చర్మం కలవారు రెండు చెంచాల బాదం పేస్ట్, వన్ టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే చర్మం మీద మలినాలు తొలగిపోయి, చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.
నానబెట్టిన బాదం పప్పులను తీసుకొని పేస్ట్ చేసి అందులో కొద్దిగా తేనె కలిపి ముఖం మీద అప్లై చేసి స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోవడంతో పాటు చర్మం వజ్రంలా మెరిసిపోతుంది.
బాదం పొడిని, కొబ్బరి పాలతో కలిపి పేస్ట్ చేసి ముఖానికి రాయడం వల్ల ముఖం ప్రకాశవంతంగా తయారవడం తో పాటు మృదువుగా మెత్తగా తయారవుతుంది.
పైన చెప్పిన చిట్కాలను పాటించి,చర్మం కాంతివంతంగా, ప్రకాశవంతంగా తయారుచేసుకోండి.