అందంగా కనిపించాలంటే మనం తీసుకునే ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బాహ్య సౌందర్యం బాగుండాలంటే అందుకు తగిన శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి.విటమిన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది.ఈ పదార్థాలు తక్కువగా తీసుకోవడం మంచిది.అలాగే కొన్ని నియమాలు పాటించాలి. వ్యాయామం చేయాలి.వేలకు నిద్ర పోవాలి.టెన్షన్స్ తగ్గించుకోవాలి.ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించడం వల్ల కూడా అందంగా కనపడతారు.సహజసిద్ధంగా ఎలాంటివి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

 అలిసిపోయిన కళ్ళకు, జీవం లేనట్టు కనబడే కళ్ళకు మేకప్ వేసుకునే ముందు చల్లని దోసకాయ గుజ్జు లో దూదిని ముంచి కళ్ళపై ఉంచుకోవాలి. చేయడంవల్ల కళ్ళు బాగుంటాయి.

 పొడిబారిన చర్మానికి ఈ విధంగా చేయాలి.ఒక టేబుల్ స్పూన్ దోస రసము, ఒక టేబుల్ స్పూను టమోటా రసం ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం,ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్లు అన్నింటికీ కలిపి ముఖానికి అప్లై చేసుకొని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

 జిడ్డు చర్మం ఉన్నవాళ్లు పావు టేబుల్ స్పూన్ నిమ్మరసంలో, రెండు టేబుల్ స్పూన్లు తురిమిన కమలా తొక్కలు, కొంచెం పాలు కలిపి ఒక రోజంతా ఫ్రిజ్లో ఉంచాలి.దీనిని బాడీ లోషన్ కూడా వాడవచ్చు.

 ఒకటిన్నర స్పూన్ పెరుగు,ఒక టేబుల్ స్పూన్ చిన్నగా తరిగిన కమలా తొక్కలు,ఒక టేబుల్ స్పూన్ ఔట్ మిల్,ఇవన్నీ కలిపి ఒక మిశ్రమంగా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మం మీద మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద ఉన్న మృత కణాలు, బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి.

ఎండకు నల్లబడిన ముఖానికి నిమ్మరసం, మజ్జిగ సమభాగాలుగా తీసుకొని ముఖానికి మర్దనా చేయడం వల్ల ముఖము నిగారింపుగా ఉంటుంది.

 ఆవనూనెలో శెనగపిండి, పసుపు కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల ఒక ముఖం కాంతివంతంగా ఉంటుంది.

 రెండు చెంచాలు గ్లిజరిన్ లో సగం స్పూన్ గులాబీ నీళ్లు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి రాత్రిపూట రాసుకోవాలి. ఉదయం లేవగానే కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముడతలు పడిన చర్మాన్ని ముడతలు లేకుండా పోతాయి.

 కుంకుమ పువ్వు తో తయారు చేసిన పేస్టును ముఖము, చేతులపై రాసుకుంటే చర్మం మృదువుగా అవుతుంది. అంతేకాకుండా మెరుస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: