వెంట్రుకలు రాలి పోయిన చోట చేదుగా ఉన్న పొట్లకాయ తీసుకొని రసం తీసి ఆ రసాన్ని అక్కడ పట్టించడం వల్ల పేనుకొరుకుడు సమస్య నుండి బయటపడవచ్చు.
పేను కొరికిన చోట మళ్లీ వెంట్రుకలు రావడానికి, ఈ విధంగా చేయాలి. ఎండిపోయిన పొగాకును తీసుకొని కొబ్బరి నూనెలో నానబెట్టాలి. కొద్దిసేపు తర్వాత నూనెను వడగట్టి ఆ నూనెను రోజు పేరు కొరికిన చోట రాయడం వల్ల వెంట్రుకలు మళ్ళీ వస్తాయి.
తలలో పేలు లేకుండా చేయడానికి, వెల్లుల్లి తీసుకొని మెత్తగా నూరి దానికి నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టు పై అప్లై చేయాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో ఉన్న పేలు బయటకు వస్తాయి.
పేల సమస్య తో బాధ పడుతున్న వాళ్ళు రోజు పడుకోబోయేముందు వెనిగర్ ను తీసుకొని తలకు పట్టించుకోవాలి, తర్వాత తలకు టు వాళ్ళతో బాగా చుట్టాలి. అలాగే రాత్రంతా ఉంచుకొని ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దువ్వెనతో దువ్వడం వల్ల పేలు బయటకు వస్తాయి.
జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము,ధూళి,జిడ్డు లేకుండా చూసుకోవాలి.శుభ్రంగా ఉండడం వల్ల పేలు చేరే అవకాశం ఉండదు.
దువ్వెనను రోజూ శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి వేడి నీటితో కడగడం వల్ల దువ్వెన పై ఉన్న జిడ్డు, మురికి పోతాయి.
గురివింద గింజలు బాగా అరగదీసి దీనికి కొంచెం గంధం కలిపి పేను కొరికిన చోట రాయాలి. ఇలా నాలుగైదు రోజులు చేయడం వల్ల మళ్లీ వెంట్రుకలు వస్తాయి.
ఎర్ర మందారం పూలు తీసుకొని గ్లాసు నీళ్ళు పోసి బాగా మరిగించాలి. ఒక గ్లాసు నీళ్లు వచ్చేవరకు మరగనివ్వాలి చల్లారిన తర్వాత వడగట్టి ఆ నీటిని రోజు తలకు రాయడం వల్ల పేనుకొరుకుడు సమస్య తగ్గుతుంది.