
బ్యాక్టీరియాను రాకుండా అడ్డుకోవడం వల్ల ప్లాక్యూ తొలగిపోతుంది.ప్లాక్యూ వల్ల దంతక్షయం,చిగుళ్ల వ్యాధులువ్యాధులు వస్తాయి.కొబ్బరి నూనెఆరోగ్యానికి చాలా మంచిది. నూనెను నోటిలో పోసుకొని ఆయిల్ పుల్లింగ్ చేయడంవల్ల బ్యాక్టీరియా చనిపోతుంది.ఇంకా నోటి దుర్వాసన, పంటి నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. పళ్ళు కూడా తళతళ మెరుస్తాయి.పసుపు వేస్తున్న ఈ విధంగా తయారు చేసుకోండి.పసుపు కొమ్ముల నుండి తయారు చేసిన పసుపును నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా తీసుకోవాలి3 టేబుల్ స్పూన్లు నూనె తీసుకొని ఈ మూడింటిని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.ఈ పేస్ట్ ను ఎలా వాడాలో తెలుసుకుందాం.
పసుపు పేస్టును బ్రష్ మీద వేసుకొని 2 లేదా 3 నిమిషాలు పళ్ళు తోముకోవాలి ఈ విధంగా చేయడం వల్ల పళ్ళు తెల్లగా మెరుస్తాయి.
వేడి చేసిన కొబ్బరినూనెను గోరువెచ్చగా చేసుకుని నోటిలో పోసుకొని పుక్కలించాలి. దీనివల్ల నోటి దుర్వాసన పోతుంది.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయడంవల్ల నోరు శుభ్రంగా ఉంటుంది.
పసుపు మరకలు పెదవుల పైన పడితే మరకలు తొందరగా పోవు కాబట్టి పళ్ళు తోముకునే టప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఒకవేళ మరకలు పడితే మరల పైన పాలు వేసి ఐదు నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. మరకలు తొలగిపోతాయి.తయారుచేసిన పేస్టు మిగిలితే ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని ఉపయోగించేటప్పుడు మృదువుగా ఉండే బ్రష్ వాడడం మంచిది. అదే విధంగా నోటిని శుభ్రంగా ఉంచుకోండి. కొబ్బరి నూనెతో నోరు ఆయిల్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు.ఈ విధంగా నోరు శుభ్రంగా ఉంటుంది.