ప్రతి ఒక్కరికి జుట్టురాలే సమస్య ఎక్కువ అయితే.. అందులోనూ చుండ్రు సమస్య మరీ ఎక్కువ అవుతోంది. ఈ చుండ్రు సమస్య కారణంగా దురద వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య తీవ్రమవుతోంది. చలికాలంలో బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి ఎక్కువగా యాక్టివేట్  అవుతాయి. అందుకే మామూలు సమయంలో కన్నా ఎక్కువ సమయంలో చుండ్రు చలికాలం రాగానే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక చుండ్రు కారణంగా ఎన్నో చిట్కాలను పాటిస్తూ ఉంటారు.  అంతేకాకుండా ఇందుకోసం డాక్టర్లు చుట్టూ సైతం తిరిగి అలసిపోతుంటారు. అంటే ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలను పాటించి,ఎలాంటి చుండ్రుని అయినా చిటికెలో తొలగించవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.


చలికాలంలో మరీ ముఖ్యంగా చాలామందికి దాహంగా  అనిపించదు. ఫలితంగా నీరు ఎక్కువగా తాగడానికి ఇష్టపడరు. కాలమేదైనా మనిషి రోజూ తాగే నీటి పరిణామం కనీసం మూడు నుంచి నాలుగు లీటర్లు ఉండాలనేది నిపుణుల అభిప్రాయం.  అసలు కారణం  నీటిని ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల శరీరంలోని తేమ తగ్గిపోయి చర్మం పొడిబారుతుంది. ఇక అలాగే మన తల మాడు కూడా పొడిబారిపోయి మెల్లిమెల్లిగా పొట్టులాగ తయారయ్యి, అది క్రమంగా పెరుగుతూ మనల్ని ఇబ్బంది పెడుతుంది.కాబట్టి రోజుకు సరిపడా నీళ్ళు తీసుకోవడం మంచిది.


వారానికి రెండు సార్లు కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసుకుని,మాడుకు పట్టించి,మసాజ్ చేయడం వల్ల జుట్టుకు తగినంత తేమ అంది,చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. వారానికి ఒకసారి వేప నూనెను తలకు పట్టించి, మసాజ్ చేసుకుని గంట తర్వాత తలంటు పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు కూడా పెరుగుతుంది.

చుండ్రు నివారణకు హెయిర్ ప్యాక్ లు మంచివని  చాలామంది హెయిర్ ప్యాక్ లు  వేస్తుంటారు. హెయిర్ ప్యాక్ లు వేయడం వల్ల, చల్లదనం కుదుళ్ళ ద్వారా తలలోకి వెళ్లి, తలలో నరాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి చలికాలంలో హెయిర్ ప్యాక్ లకు  దూరంగా ఉండటం మంచిది. అయితే వారానికి  ఒకసారి నిమ్మకాయ, పెరుగు కలిపి హెయిర్ ప్యాక్ వేసుకొని, కేవలం అరగంట తర్వాత తలంటు పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రును నివారించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: