సాధారణంగా వేపాకులు సర్వరోగనివారిణి అని అందరికీ తెలుసు. వేపాకులు ఎలాంటి రోగాన్ని అయిన  నయం చేయగలవు. హిందూ సాంప్రదాయం ప్రకారం వేపాకును దేవతగా కూడా కొలుస్తున్నారు.  మన భారతదేశంలో వేప చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. వేప చెట్టు యొక్క ఆకులు,కాండం,పూత,చిగురు ఇలా అన్నీ మనకు ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. ఉగాది పండుగ వచ్చిందంటే చాలు.. వేప పూతను తీసుకొచ్చి, పచ్చడిలో వేసి షడ్ రుచులను మనకు రుచి చూపిస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అంతేకాకుండా వేప చెట్టు యొక్క బెరడు ను ఉపయోగించి ఎన్నో గాయాలను నయం చేసుకోవచ్చు. అయితే తలస్నానం చేసేటప్పుడు వేపాకులను నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల, ఎన్నో రోగాలను అరికట్టవచ్చని వైద్య నిపుణులతో పాటు ఆయుర్వేద నిపుణులు కూడా సూచిస్తున్నారు. అయితే ఆ ప్రయోజనాలు ఏంటో? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

వేపాకులను వేడి నీటిలో వేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తలంటు పోసుకుంటే,  తలలో ఉన్న చుండ్రు, దురద లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా తలలో పేను లు కూడా తొలగిపోయే అవకాశం చాలా ఎక్కువ. ఇక జుట్టు దృఢంగా, నల్లగా,ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నవారు వేపాకులు మరిగించిన నీటితో స్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.

ముఖం మీద మచ్చలు, మొటిమలతో బాధపడుతున్న వారు కూడా వేపాకులను మరిగించిన నీటితో ముఖం కడుక్కోవడం వల్ల ముఖం మీద మొటిమలు తొలగిపోవడంతో పాటు నల్లటి మచ్చలు కూడా తొలిగిపోతాయి.

ఇక చర్మానికి అనుకోకుండా ఏవైనా గాయాలు,పుండ్లు అయినప్పుడు వేప చెట్టు యొక్క బెరడు తీసుకొచ్చి, ఆ బెరడును రాతి మీద నూరి, ఆ రసాన్ని గాయాలపై పట్టించాలి. ఇలా చేయడం వల్ల  పుండ్ల మీద ఏర్పడిన బ్యాక్టీరియా త్వరగా నశించిపోయి,గాయాలు, పుండ్లు  త్వరగా మానిపోతాయి.


ఆయిల్ స్కిన్ తో బాధపడేవారు ఒక కప్పు నీటిలో వేపాకులను వేసి మరిగించి,ఆ నీటిని వడగట్టాలి. వడగట్టిన నీటితో ముఖం కడుక్కోవడం ద్వారా ఆయిల్ స్కిన్ నుంచి నుంచి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: