స్ట్రాబెరీ లలో యాంటీఆక్సిడెంట్లు,విటమిన్ల తోపాటు చర్మానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే ఇతర పోషకాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్ట్రాబెర్రీలు ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి . అలాగే ముఖంమీద ఏర్పడ్డ హైపర్ పిగ్మెంటేషన్, నల్లటి మచ్చలు, మొటిమలు కూడా త్వరగా తగ్గిపోతాయి . కాబట్టి స్ట్రాబెర్రీ వల్ల మన చర్మానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడుతుంది :
స్ట్రాబెరీ లలో ఎల్లాజిక్ తో పాటు ఆంథోసైనిన్ తోపాటు అనేక యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. సూర్య కిరణాల ద్వారా మన చర్మానికి కలిగే నష్టాలను తగ్గించడానికి ఎల్లాజిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది.
ఉబ్బిన కళ్ళకు ఉపశమనం ఇస్తుంది.
చాలామంది ఎక్కువసేపు నిద్రపోయినా కూడా కళ్ళు ఉబ్బి పోతాయి. ఇలాంటి వారు స్ట్రాబెర్రీలను ను రెండు ముక్కలుగా చేసి, పడుకునేటప్పుడు ఆ ముక్కలను కనురెప్పల మీద పెట్టుకోవాలి. ఇలా 15 నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత, ముక్కల్ని తొలగించి, చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే తప్పక రిజల్ట్ వస్తుంది.
గోర్లు ఆరోగ్యంగా ఉండడం కోసం :
బలమైన గోర్ల కోసం ఉత్తమమైన పోషకం బయోటిన్. స్ట్రాబెరీ లలో బయోటిన్ పుష్కలంగా లభిస్తుంది. శరీర కణాల నిర్మాణం లో ముఖ్యమైన పోలిక్ ఆమ్లం తో పాటు విటమిన్ సి లు స్ట్రాబెరీ లలో ఉన్నాయి. ఇవి సహజంగా జుట్టును,చర్మాన్ని,గోర్ల ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఫలితంగా గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
పాదాలను సున్నితంగా చేయడం :
చర్మం పొడిబారిపోయి, నిర్జీవంగా,చర్మం కళతప్పి పాదాలు పుట్టడానికి అసహ్యంగా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు స్ట్రాబెర్రీలు, గ్లిజరిన్ తో పాటు ఓట్స్ కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పాదాలను నీటిలో నానబెట్టి, ఈ మిశ్రమాన్ని పోయాలి. ఆ తర్వాత సున్నితంగా మసాజ్ చేస్తూ,స్క్రబ్ లాగ చేయాలి. ఇలా చేయడం వల్ల చనిపోయిన చర్మ కణాలను తొలగించి, పాదాలు అందంగా మృదువుగా, అందంగా కనిపిస్తాయి.