గాడిద పాలు తాగితే.. అందం పెరుగుతారా..? ఇదెక్కడి విడ్డూరం అని ఆశ్చర్యపోతున్నారా..? అవునండి.. గాడిద పాలు తాగడం వల్ల చర్మ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ గాడిదపాలు ప్రావీణ్యం లోకి వచ్చిన తర్వాత మగువలు తమ అందాన్ని పెంచుకోవడానికి గాడిద పాలు తాగుతూ, గాడిద పాలతో తయారు చేసిన సబ్బులను వాడుతున్నారు. వారి అందం కోసమే కదా.. లేకపోతే గాడిద పాలకు లీటర్ కు వెయ్యి రూపాయలు పెట్టి ఎందుకు కొంటారు.. నిజానికి గాడిద పాలు అందానికి చాలా మంచివని సైంటిస్టులు ఒక పరిశోధన ద్వారా తేల్చారు. ఆవుపాలు,మేకపాల కంటే గాడిద పాలకు డిమాండ్ ఎక్కువ.

ఈ పాలలో యాంటీఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందుకు నిదర్శనం ఈజిప్టు మహారాణి క్లియోపాత్ర కూడా గాడిద పాలతో స్నానం చేసేవారట. చర్మం మృదుత్వాన్ని సంతరించుకోవడానికి, మీ అందం రెట్టింపు అవడానికి గాడిదపాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే ఢిల్లీలోని ఒక స్టార్టప్ కంపెనీ గాడిద పాలతో తయారు చేసిన సబ్బులను విక్రయిస్తోంది. ఈ పాలను తాగుతూ ఉండడంవల్ల వృద్యాప్య ఛాయలు దరిచేరవు.

ఇక గాడిద పాలతో తయారు చేసిన సబ్బులకు కూడా చాలా డిమాండ్ ఉంటుందని ఆర్గానిక్ సంస్థ వ్యవస్థాపకురాలు పూజాకౌల్ అంటున్నారు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గించి,చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో గాడిద పాలతో తయారు చేసిన సబ్బులకు డిమాండ్ ఎక్కువ ఉంది. అలాగే ఈ సబ్బులు వాడేవారు సంఖ్య కూడా అక్కడ రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది.


 గాడిద పాలు లీటర్ వెయ్యి రూపాయలు పెట్టి కొనడానికి అయినా వెనుకాడడం లేదు. గాడిద పాలు తాగడం, గాడిద పాలతో తయారు చేసిన సబ్బులను వాడే వారు ఎక్కువ అవ్వడం వల్ల,ఈ గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇక లైంగిక సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడేవారు, ఆస్తమా,ఆర్థరైటిస్, షుగర్ వంటి సమస్యలకు  గాడిద పాలు  చక్కని పరిష్కారం.. కాబట్టి మీరు కూడా గాడిద పాలు తాగితూ,మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: