గోవాలోని ముఖ్యంగా బీచ్ వద్ద ఉండే గ్రామీణ ప్రాంతాలలో ఉండే అద్దె ఇళ్లకు బాగా గిరాకీ పెరిగిందని ఇంటిలో ఉంటూ గోవా బీచ్ అందాలను చూస్తూ ఆనంద పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రెండ్ ఉత్తర గోవాలోని అరంబోల్ ప్రాంతంలో ఎక్కువగా నడుస్తోంది. అద్దెకు ఉండడం కోసం ఆ ప్రాంతానికి సంబంధించిన ఇళ్లను ఫేస్ బుక్ ఖాతా వంటి సామాజిక మాధ్యమాలలో బాగా సెర్చ్ చేసి, ఎంక్వయిరీ చేసుకొని అద్దెకు తీసుకోవడం విశేషం.
ఈ మధ్యకాలంలో గోవా వెళ్లడానికి నిశ్చయించుకున్న బడా బాబులు వారితో పాటు వారి ఇంటిలో పని చేసేటటువంటి పనివాళ్లను,వంట వాళ్లను కూడా తీసుకెళ్లడంతో ఏదైనా హోటల్లో ఉండడం కంటే, ఈ విధంగా ఇంటిని అద్దెకు తీసుకొని ఉండడం ఉత్తమమని భావిస్తున్నారు. ఈ విధంగా గోవా వచ్చే పర్యాటకులు ఏదైనా ఇంటిని అద్దెకు తీసుకుని ఉండటానికి ఇష్టపడటం వల్ల గోవాలో పలు హోటళ్లకు గిరాకీ కూడా తగ్గిందని ఫస్ట్ క్లాస్ హాలీడేస్ సంస్థ డైరెక్టర్ ఆతిష్ ఫెర్నాండెజ్ తెలిపారు. ప్రస్తుతం గోవా వచ్చే పర్యాటకులు అందరూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నట్లు ఆతీష్ తెలిపారు.