తెల్ల జుట్టు రావడం మొదలుపెట్టగానే మొదటి దశ ప్రారంభం లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అండాశయం, మందపాటి, ముదురు జుట్టు త్వరగా పడిపోవడం ప్రారంభమవుతుంది. ఇక సన్నని తెల్ల జుట్టు వేగంగా పెరుగుతూ వస్తుంది. పురుషుల విషయంలో జుట్టు ఎక్కువగా గడ్డం పైన,మీసాల పైన ఎక్కువగా మొదట కనిపిస్తుంది. ఇక ఆడవారిలో ముందు నుదిటి పైన తెల్ల వెంట్రుకలు పొడుచుకు రావడం ప్రారంభ అవుతాయి..
అయితే ముందుగా చెప్పినట్టుగా తెల్లజుట్టు ఎల్లప్పుడూ మీ ప్రామాణిక వయసుకు ప్రమాణం కాదు. ఈ తెల్ల జుట్టు " కొన్నిసార్లు ఒక రకమైన అంతర్గత తీవ్రమైన అనారోగ్యం మీ శరీరాన్ని చుట్టుముడుతుంది " అనే మరొక సూచన కూడా కావచ్చు. ఇది వెంటనే పరిష్కరించకపోతే అది ప్రాణాంతకం కూడా కావచ్చు. ముఖ్యంగా విటమిన్ లోపంతో బాధపడుతున్న వారికి ఈ తెల్ల జుట్టు త్వరగా ఆవహిస్తుంది. శరీరంలో విటమిన్ b12 లోపం ఉంటే, శరీరం దాన్ని వర్ణ ద్రవ్యాన్ని కోల్పోతుందని పరిశోధనలో తేలింది. వర్ణద్రవ్యం అంటే మెలనిన్ అనే పదార్థం. ఈ మెలనిన్ జుట్టు రంగు కు కారణమవుతుంది.
ఇక అంతే కాకుండా థైరాయిడ్ గ్రంథిని మార్చినప్పుడు ద్రవించే హార్మోన్ల పరిమాణం అందులోని మార్పులకు కారణమవుతుంది. తెల్ల జుట్టు ఎక్కువగా వస్తోంది అంటే థైరాయిడ్ సమస్య రాబోతోందనే సూచిక కూడా కావచ్చు. అలాగే గుండె సంబంధిత వ్యాధులు, కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు కూడా తెల్ల జుట్టు అధికంగా వచ్చి,నల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడికి గురి అయినప్పుడు కూడా జుట్టు రాలే సమస్య కారణమవుతుంది. మానసిక ఒత్తిడి కారణంగా ముఖం పాలిపోవడం వంటివి జరుగుతుంటాయి. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇలాంటివి తగ్గించాలి అంటే సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం,శరీరానికి తగినన్ని నీటిని అందివ్వడం వంటివి చేయడం వల్ల జుట్టు రాలే సమస్యతో పాటు జుట్టు త్వరగా తెల్లబడటం కూడా అరికట్టవచ్చు.