ముందుగా జుట్టు రాలడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం...
జుట్టు రాలడానికి ప్రధాన కారణం జుట్టును, సరిగ్గా కాపాడుకోవడంలో విఫలమవుతున్నారని నిపుణులు అంటున్నారు. అయితే జుట్టుకు కూడా సరైన సమయంలో సరైన పోషణను అందించాలి, అప్పుడే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. మరీ ముఖ్యంగా చాలామంది తీసుకునే ఆహారంలో అసమతుల్యత కలిగిఉండటం, అధిక ఒత్తిడి, అధిక వేడి, పొడి జుట్టు, రోజూ తలస్నానం చేయడం, దువ్వెన సరిగ్గా లేకపోవడం( చెక్క దువ్వెనను ఉపయోగించాలి ), జుట్టు చివర్లను కత్తిరించడం ఇలాంటి పనులు వల్ల జుట్టు రాలే సమస్య కూడా కొంత వరకు కారణం అవ్వవచ్చు..
అయితే జుట్టు రాలడాన్ని నివారించాలంటే జుట్టు పెరుగుదలకు విటమిన్ ల పోషణ అవసరం. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ డీ 3, బయోటిన్ కూడా జుట్టు పెరుగుదలకు,అలాగే జుట్టు కుదుళ్ళకు మంచి రక్తప్రవాహానికి సహాయపడతాయి. ఇందుకోసం సిట్రస్ జాతికి చెందిన పండ్లను, జున్ను, గుడ్లు, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.. గ్రీన్ టీ కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జుట్టుకు సంబంధించిన అన్ని వ్యాధులను దూరం చేస్తాయి..
ఇక అలాగే జుట్టుకు కుదిరితే నెలకు రెండు లేదా మూడు సార్లు,లేదా వారానికి ఒకసారి కలబంద హెయిర్ ప్యాక్, లేదా గుడ్డులోని తెల్లసొన తో హెయిర్ ప్యాక్ వేసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. అలాగే ఉల్లిపాయ రసం తో కూడా జుట్టు కుదుళ్లకు మర్దనా చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోవడం మధ్యలో విరిగిపోవడం లాంటి సమస్యల నుంచి బయట పడవచ్చు...