ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కమలాఫలం రసంలో అర టేబుల్ స్పూన్ పసుపు పొడి కలపాలి. రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ప్యాక్‌ను తొలిగించుకొని చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.కమలా ఫలం సిట్రస్ జాతికి చెందిన పండు. దీనిలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి పోషణను ఇచ్చి అందంగా మెరిసిపోయేలా చేస్తుంది. పైగా కమలాఫలం సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా మారిపోతుంది. కమలాఫలానికి పసుపు జోడించి ఫేస్ ప్యాక్ వేసుకొంటే చర్మం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్‌ను రాత్రి నిద్రపోయే ముందు అప్లై చేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఒక గిన్నెలో టీస్పూన్ శెనగపిండి, అరకప్పు పాలు, ఒక స్కూప్ తేనె తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ మాస్క్‌ను 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఈ సమయంలో దాన్ని తాకకూడదు. నిర్ణీత సమయం తర్వాత మైల్డ్ సోప్ ఉపయోగించి గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది.చర్మ గ్రంథుల నుంచి విడుదలయ్యే నూనెలను క్రమబద్ధీకరిస్తాయి.అంతేకాదు చర్మకణాలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. చర్మాన్ని హైడ్రేట్ చేసి సహజమైన మెరుపును అందిస్తాయి.