ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు తెల్లబడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసుగు చెంది ఉంటారు. అంతేకాకుండా తెల్ల జుట్టు ను నివారించడానికి, మార్కెట్లో దొరికే ఎన్నో రకాల హెయిర్ కలర్స్ ను కూడా వాడుతున్నారు. అయితే ఈ కలర్స్ వల్ల తాత్కాలికంగా జుట్టు రంగు మారినప్పటికీ, భవిష్యత్తులో ఎన్నో సమస్యలు వస్తున్నాయని చాలామంది వాపోతున్నారు కూడా.. అయితే ఇప్పుడు కేవలం కాఫీపొడితో మీ జుట్టును నల్లగా చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.. అయితే కాఫీ పొడితో జుట్టును ఎలా నల్లగా చేసుకోవాలి..? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
అద్భుతమైన రుచిని అందించే కాఫీ కి, జుట్టు రంగును మార్చే శక్తి కూడా ఉంది అంటే ఎవరైనా నమ్మగలరా..? కానీ ఇదే నిజం.. కాఫీ జుట్టుకు మంచి డైయింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. దీనిని తరచూ వాడడం వల్ల జుట్టు రంగు నల్లగా మారడమే కాకుండా ఆరోగ్యంగా,మెరుస్తూ ఉంటుంది. అయితే ఇందుకోసం ముందుగా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ ను తీసుకోవాలి. దానికి 150 మిల్లీ లీటర్ల నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని ముదురు రంగు వచ్చేవరకు స్టవ్ మీద మరిగించాలి. ఆపై చల్లారిన తర్వాత జుట్టుకు, జుట్టు కుదుళ్లకు పట్టించాలి.
ఒక 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు బాగా జట్టును ఆరనిచ్చి, ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నలుపు రంగులోకి మారడాన్ని గమనించవచ్చు.. అయితే సాధ్యమైనంత వరకు నెలకు రెండు సార్లు ఈ పద్ధతిని పాటించండి. ఇంకొకటి ఏమిటంటే మీరు తీసుకునే కాఫీ పొడి లో ఎలాంటి ఫ్లేవర్ లు కలపకుండా, ప్యూర్ కాఫీ పొడిని మాత్రమే తీసుకోవడం ఉత్తమం..
చూశారు కదా ఫ్రెండ్స్.. కాఫీ పొడి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో..! కాబట్టి మార్కెట్లో దొరికే కాస్మెటిక్స్, హెయిర్ కలర్ కు గుడ్ బాయ్ చెబుతూ, కాఫీపొడి కి హాయ్ చెప్పండి. కాఫీ పొడి చేసే మ్యాజిక్ ను మీరూ గమనించి,మీ తోటి వారికి కూడా చెప్పేందుకు ప్రయత్నం చేయండి..