సాధారణంగా జామకాయ తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అని అందరికీ తెలుసు. కానీ జామ ఆకులు ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుతాయని చాలా మందికి తెలియకపోవచ్చు. నిజానికీ జామ ఆకులు ముఖం మీద ఉన్న మచ్చలను, మొటిమలను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.. అయితే జామ ఆకులు ఎలా ముఖం మీద మొటిమలు తొలగిస్తాయో..? పేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో..?ఇప్పుడు చూద్దాం


జామ ఆకుల లో ఉండే పొటాషియం,ఫోలిక్ యాసిడ్లు చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించడానికి ఎంతగానో సహకరిస్తాయి. మరీ ముఖ్యంగా చర్మ సౌందర్యాన్ని పెంచడానికి జామ ఆకులకు మంచి మెడికల్ గుణాలు ఉన్నాయి. ఇందులో ఆంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా జామ ఆకుల లో ఫ్లేవనాయిడ్స్, గాలిక్ యాసిడ్, కేరెటోనాయిడ్స్, ఆస్కార్బీక్ యాసిడ్ వంటివి ఉన్నాయి..


ఇవి చర్మం మీద ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. అంతే కాకుండా చర్మానికి ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు ఈ జామ ఆకుల ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల తిరిగి చర్మం అందాన్ని పుంజుకుంటుంది. స్కిన్ రిపేర్ చేయడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.. అయితే ఈ పేస్ట్ ని ఎలా తయారు చేసుకోవాలంటే.., లేత జామ ఆకుల పది, కొద్దిగా నీళ్లు. జామ ఆకుల పేస్టు తయారు చేసుకోవడానికి ముందుగా ఆకులను శుభ్రం చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి మెత్తని పేస్ట్ లా తయారు చేయాలి..


ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయక ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత ముఖానికి ఆవిరి పట్టించాలి. తద్వారా ముఖం మీద ఉన్న రంద్రాలు ఓపెన్ అవుతాయి. ఈ స్టీమ్ పద్ధతిని మాత్రం మిస్ చేయకండి. ఇప్పుడు మనం నూరుకున్న పేస్ట్ ను ముఖానికి  అప్లై చేయాలి. బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా ముఖాన్ని కడుక్కోవాలి. ఈ పేస్ ప్యాక్ అప్లై చేసిన రోజు సబ్బు నీళ్లతో ముఖాన్ని కడుక్కోరాదు. ఇలా చేయడం వల్ల త్వరలోనే ముఖం మీద ఉన్న మచ్చలు మొటిమలు తగ్గడం గమనించవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: