పూర్వ కాలంలో చాలా మందికి అసలు సబ్బు అంటే ఏంటో కూడా తెలియదు. వారు కేవలం సున్నిపిండిని మాత్రమే స్నానానికి ఉపయోగించే వారు. అందుకే ఎలాంటి ఖర్చులేకుండా వారు ఎంతో అందంగా, చూడముచ్చటగా కనిపించేవారు. కానీ ప్రస్తుత కాలంలో పెరుగుతున్న అత్యాధునిక టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త సబ్బులు మార్కెట్లో విడుదల అవుతున్నాయి. వీటి వాడకం కూడా ఎక్కువ అవ్వడం వల్ల ఉత్పత్తిదారులు వీటిని రక రకాల ఫ్లేవర్ల లో తయారు చేస్తున్నారు. అయితే వీటిని వాడడం వల్ల చర్మం మీద తేమను పీల్చుకుని చర్మం పొడిబారేలా చేస్తాయి.. మొటిమలు, మచ్చలు వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు.
అయితే సున్నిపిండితో స్నానం చేసేవారు చర్మ రంధ్రాలు లోపల ఉన్న మురికిని కూడా ఈ సున్నిపిండి తొలగిస్తుంది. అంతేకాకుండా ఎండాకాలంలో పట్టే చెమట కాయలు, చెమట దుర్వాసన, దద్దుర్లు వంటివి కూడా తొలగించడానికి ఎంతో ఉత్తమం. సున్నిపిండి తో స్నానం చేయడం వల్ల శరీరం తేలికగా, హాయిగా, ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా చర్మ సమస్యలు దూరమవుతాయి..
ఇక చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు సున్నిపిండితో స్నానం చేసిన తర్వాత కొబ్బరి నూనెను శరీరానికి పట్టించుకోవడం ఉత్తమం.. ముఖం మీద ఉండే మొటిమలు, మచ్చలు, చారలు వంటి వాటన్నింటినీ చాలా సులభంగా తొలగిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని టైట్ గా చేసి చర్మం, ముడతలు లేకుండా చేస్తుంది..
అలాగే శెనగపిండి కూడా చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. శెనగపిండిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించడం వల్ల, చర్మం నిగనిగలాడుతూ మచ్చలు లేని ముఖం మీ సొంతమవుతుంది. అంతేకాకుండా ఈ శెనగపిండి తో కేవలం ముఖం మాత్రమే కాకుండా శరీరాన్ని కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఈ పిండి తో ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత ముఖానికి సబ్బు ఉపయోగించకూడదు. అలాగే పాలతో శుభ్రం చేసుకోవాలి. ఒక వారం ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.