కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చేతులను శుభ్రంగా ఉంచుకోవడం కోసం శానిటైజర్  ను తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ హ్యాండ్ శానిటైజర్ పదేపదే ఉపయోగించడం వల్ల చేతులు పొడిబారిపోతున్నాయని, రఫ్ గా తయారవుతున్నాయని చాలామంది వాపోతున్నారు. ఇక ఒకవేళ మన చేతుల పై ఉన్న క్రీములను నశింపజేసే శానిటైజర్ ను వాడకపోయినా,  సబ్బులు వాడినా కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది..అయితే ఈ హ్యాండ్ శానిటైజర్ ను ఉపయోగించినా కూడా చేతులు రఫ్ గా మారకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


హ్యాండ్ శానిటైజర్ రాసిన తర్వాత చేతులు రఫ్ గా మారుతున్న వారికి కోకో బటర్ లేదా బటర్ తో మీ చేతులపై మాయిశ్చరైజింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే అలోవెరా ని కూడా ఉపయోగించవచ్చు. దీంతో మీ చర్మం మృదువుగా, తాజాగా మెరుస్తూ ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ ఈ లేదా ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ ను కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల చర్మానికి కాస్త ఉపశమనం కలుగుతుంది. అలాగే దురద,మంట వంటి సమస్యలు కూడా దూరమవుతాయి..


అలాగే మానిక్యూర్ పద్ధతి కూడా ఒకటి. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక పద్ధతిని పాటించి చూడండి. ఇంట్లోనే సెలూన్ లాగా మానిక్యూర్ చేసుకోవచ్చు. ముందుగా క్యూటికల్ క్రీమ్ ను ఉపయోగించడం వల్ల క్యూటికల్ ను నరీష్ చేయవచ్చు. చేతుల చర్మం పై డెడ్ స్కిన్ ను తొలగించడానికి మినరల్స్ ఉపయోగించడం ఉత్తమం. స్కిన్కు హైడ్రేషన్ ఇవ్వడానికి ఆర్గానిక్ ఫ్రూట్ పల్ప్ ని ఉపయోగించవచ్చు.


ఇక సాల్ట్ వేసిన నీళ్ళలో చేతులు అద్దడం ద్వారా చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. అలాగే రోజూ నార్మల్ వాటర్ తో చేతులు కడుక్కోవటానికి ప్రయత్నం చేయాలి. కడిగిన వెంటనే మాయిశ్చరైజర్ లాంటివి రాస్తూ, చర్మానికి తగినంత తేమను అందేలా చూసుకోవాలి .కాబట్టి ఈ పద్ధతులను ఒకసారి వాడి చూడండి. ఇలా చేయడం వల్ల చేతులు మృదువుగా,మెత్తగా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: