
ఎటువంటి మేకప్ అయినా ఎక్కువ సేపు నిలిచి ఉండాలంటే సెట్టింగ్ స్ర్పే లేదా ఫేస్ మిస్ట్‌ను వాడాలి. ఇవి.. మేకప్ మీద రక్షణ కవచంలా ఏర్పడి ఎక్కువ సేపు నిలిచి ఉండేలా చేస్తాయి.
రొటీన్ కి భిన్నంగా డ్రెస్, యాక్సెసరీస్, జువెలరీ అన్నీ ఒకే కలర్‌వి సెలెక్ట్ చేసుకోండి. అలాగే.. హెయిర్ స్టైల్ కొద్దిగా మార్చడమో, ఎప్పుడూ పెట్టుకోని వాచ్ పెట్టుకోవడమో, కొత్త కలర్ ఫుల్ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయడమో ఇలా ప్రత్యేకంగా కనిపించేందుకు ట్రై చేయండి.మీ ముఖం మెరిసిపోవాలంటే కచ్చితంగా బ్లష్‌ను వాడాల్సిందే. సహజమైన రంగు బ్లష్‌ను సెలెక్ట్ చేసుకుంటే అందం రెట్టింపు అవుతుంది. స్కిన్ టోన్, డ్రెస్సింగ్‌కు అనుగుణంగా బ్లషర్ ని ఉపయోగించినా పర్వాలేదు. పెదాలకు లిప్‌స్టిక్ తప్పకుండా పెట్టుకోండి. రెడ్ లేదా పింక్ వంటి నేచురల్ కలర్స్ అయితే బెస్ట్. లేదా మీ పెదవుల రంగుకు దగ్గరగా ఉన్న కలరైనా ఎంచుకోండి.ఇక ఈ పద్ధతులు పాటించండి. ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు.