బంగాళాదుంపలు శరీరానికి కావలసిన పిండి పదార్థాలను అందించడమే కాకుండా ముఖాన్ని అందంగా మెరిసే లాగా చేస్తాయి. అయితే ఈ బంగాలదుంపలు చర్మానికి ఏ విధంగా ఉపయోగపడతాయో..? వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


1. బంగాళదుంపల నుండి తీసిన రసం ను కొద్దిగా తీసుకొని,అందులో నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న డార్క్ సర్కిల్స్ పై రాయాలి. ఇలా తరచుగా రాస్తూ ఉండడం వల్ల త్వరగా డార్క్ సర్కిల్స్ పోయి చర్మం నిగనిగలాడుతుంది.

2. బంగాళ దుంపల నుండి తీసిన రసంలో కొద్దిగా కీరదోస జ్యూస్ ను సమభాగాలలో కలిపి, కళ్ళ కింద నల్లటి వలయం లో ఉన్న మచ్చలపై రాయాలి. ఇలా తరచుగా రాస్తూ ఉండడం వారం రోజుల్లోనే తేడాను గమనించవచ్చు.

3. ఆలుగడ్డ నుంచి తీసిన రసాన్ని  ఐస్ ట్రే లో పెట్టి, రాత్రంతా డీప్ ఫ్రిజ్లో ఉంచాలి. ఉదయాన్నే ఈ ముక్కలను తీసి, ముఖం పైన మర్దనా చేస్తూ, ఐదు నిమిషాలపాటు రుద్దుతూ  ఉండాలి. 20 నిముషాలు ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి..


4. ఆళ్లగడ్డ రసంలో కొద్దిగా బియ్యం పిండి, రోజ్ వాటర్, నిమ్మరసం,తేనే కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి. ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాలు ఆగాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు డ్రై స్కిన్ ఉన్నవారికి కూడా ముఖం తాజాగా ఉంటుంది. మొటిమలు,మచ్చలు కూడా దూరం అవుతాయి..


5.ఆలుగడ్డలను మెత్తటి పేస్టులా చేసి,  అందులో కొద్దిగా చక్కెర కలపాలి . ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఫేస్ స్క్రబ్ చేస్తూ, సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా, అందంగా తయారవడమే కాకుండా నిగనిగలాడుతూ తాజాగా ఉంటుంది. కాబట్టి వీలైతే ఇంట్లో ఉండే ఆలుగడ్డలను ముఖానికి రాసి, అందమైన చర్మాన్ని మె సొంతం చేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: