మగవలు మెచ్చిన అందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే రకరకాల  పద్ధతులను పాటిస్తూనే, ముఖ అందాన్ని పెంపొందించుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది ముఖం మీద ఒక చిన్న మొటిమ వస్తే చాలు,  తెగ ఇబ్బంది పడిపోయి దానిని ఎలా తొలగించుకోవాలని తహతహలాడుతుంటారు. కానీ మరికొంతమంది ఏమో వచ్చింది ఒక మొటిమే కదా.. ఎందుకు అంత ఇబ్బంది.. అని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే వచ్చిన ఒక చిన్న మొటిమ కూడా ముఖం అంతటా విస్తరించడానికి  చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకే మొటిమ ఒకటైన, చిన్నదైన ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి.. అయితే ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


అలోవెరా గుజ్జును తీసుకుని,  అందులో కొద్దిగా పసుపు కలిపి, రాత్రి పడుకునే ముందు మొటిమ వచ్చిన ప్రదేశంలో చిన్నగా అప్లై చేయాలి. మరునాడు ఉదయం  ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా ఈ చిట్కాను  రెండు రోజులు పాటించడంవల్ల ఎంతటి మొటిమలు అయినా సరే ఇట్టే పోవాల్సిందే..


రెండు టేబుల్ స్పూన్ల నారింజ తొక్కల పొడిని తీసుకొని, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి, ముఖానికి అప్లై చేయాలి. పది నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద ఉన్న మొటిమలు తొలిగిపోవడమే కాకుండా ముఖం తాజాదనాన్ని అందుకుంటుంది.


అరటిపండు తొక్కలో లూటిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కొత్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అందుకే అరటి పండు తొక్క తీసుకొని లోపల భాగం తో ముఖం మీద వృత్తాకారంలో అప్లై చేయాలి. కొద్దిసేపు ఆగిన తర్వాత మంచి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు త్వరగా తగ్గిపోతాయి.


ఒక బంగాళాదుంప తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.  దీనిని ఒక వస్త్రంలో కట్టి, గట్టిగా రసం వచ్చేలాగా చేయాలి . ఈ రసాన్ని ఐస్ క్యూబ్ ట్రేలో పోసి రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి. ఒక రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఈ బంగాళాదుంపల రసం యొక్క క్యూబ్ లను తీసుకుని ముఖం మీద వృత్తాకారంలో అప్లై చేయాలి. పది నిమిషాలు ఆగి, చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద మొటిమలు తొలగిపోవడమే కాకుండా డెడ్ స్కిన్ కూడా తొలగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: