ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు మచ్చలు లేని ముఖం కావాలనుకుంటునట్టే, ముఖం నునుపుగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తూ వున్నారు. అందులో భాగంగానే ముఖం నునుపుగా మారడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే మరికొంతమంది చర్మం నునుపు తగ్గిపోతుంది అని తెగ ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు కొన్ని చిట్కాలను మీ ముందు తీసుకువచ్చాము. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి లో,ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ ల గుడ్డులోని తెల్ల సొన, అలాగే రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ తీసుకుని ఒక కప్పులో మిశ్రమంలా తయారు చేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్ లాగ వేసుకొని 15 నిమిషాలు ఆగిన తర్వాత, శుభ్రమైన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి గుడ్డులోని తెల్లసొనను ముఖానికి అప్లై చేసి, గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇక అలాగే అర కప్పు పెరుగు తీసుకొని, ముఖానికి అప్లై చేసి, పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల ముఖం నునుపుగా మారుతుంది. ఇలా చేయడం వల్ల ముఖము కోల్పోయిన తేమను తిరిగి అందుకుంటుంది.  పొడిబారిన చర్మ తత్వానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.


అర కప్పు ద్రాక్ష పండ్ల గుజ్జుకు, ఒక టేబుల్ స్పూన్ యాపిల్ గుజ్జు, మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఒక పావు కప్పు గుడ్డులోని తెల్ల సొనను కలపాలి. దీన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అయితే ఈ ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మతత్వానికి మంచిగా పని చేస్తుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు ఐస్ క్యూబ్ ని కూడా ముఖానికి రాయడం వల్ల ముఖం నునుపుగా మారుతుంది . ఇక గింజలులేని టొమాటోలను కూడా ముఖానికి ఉపయోగించవచ్చు. ఈ పద్ధతులను పాటిస్తే ఎంతటి పొడి చర్మం అయిన తిరిగి తాజాదనాన్ని అందుకొని,  నునుపుగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: