సాధారణంగా చుండ్రు సమస్య ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. మనం ఎన్ని చిట్కాలు పాటించినప్పటికీ ఈ సమస్యకు అవి తాత్కాలిక పరిష్కారాన్ని చూపిస్తాయే తప్ప.. శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వవు.చుండ్రు సమస్యలతో సతమతమయ్యేవారు ఈ ప్యాక్స్ ని తయారు చేసుకొని వాడండి. ఖచ్చితంగా చుండ్రు సమస్య తగ్గిపోతుంది...

ముందుగా హెన్నా నాలుగు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం, టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె, టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్, మెంతుల పొడి చెంచా, పెరుగు రెండు టేబుల్ స్పూన్లు తీసుకోండి...శుభ్రమైన గిన్నెలో ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని12 గంటల పాటు పక్కన పెట్టి ఉంచేయాలి. దీనిని రాత్రి సమయంలో నానబెట్టుకొంటే ఉదయం ఉపయోగించడానికి వీలుగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు నుంచి మూడు గంటల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. మీ జుట్టు డ్రై హెయిర్ అయితే తలస్నానం తర్వాత కండిషనర్ రాసుకోవాల్సి ఉంటుంది. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది.


ఇక అలాగే హెన్నా మూడు టేబుల్ స్పూన్లు, ఆలివ్ నూనె టేబుల్ స్పూన్, విప్డ్ ఎగ్ వైట్ రెండు టేబుల్ స్పూన్లు, నీరు తీసుకోండి..ఒక గిన్నెలో హెన్నా, ఆలివ్ నూనె, ఎగ్ వైట్ వేసి తగినంత నీరు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్‌కు అప్లై చేసి అరగంట నుంచి 45 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికోసారి ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. పైగా  కోడిగుడ్డులో ఉండే ప్రొటీన్ వల్ల జుట్టు బలంగా తయారవుతుంది.ఫలితంగా ఎలాంటి చుండ్రు సమస్యలు రావు. ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన సౌందర్య చిట్కాల గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: