సాధారణంగా ప్రస్తుతం ప్రతి ఒక్క అమ్మాయి తన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి, ఉపయోగించే ఫేస్ ప్యాక్ లలో నిమ్మరసం తప్పనిసరిగా వాడుతున్నారు. నిమ్మరసం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి అని అందరికీ తెలుసు. అయితే నిమ్మరసాన్ని సరైన పద్ధతిలో వాడకపోతే, దాని వల్ల జరిగే అనర్ధాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అయితే ఈ నిమ్మరసం ఎలా వాడాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
సాధారణంగా మార్కెట్లో ఉండే ప్రోడక్ట్స్ కొంతమందికి పడొచ్చు, పడకపోవచ్చు. పడితే సమస్య ఏమీ లేదు కానీ పడకపోతే అసలు చిక్కంతా.. అయితే ఎటువంటి సమస్యలు లేకుండా, మనం మార్కెట్లో వాటిని ఉపయోగించకుండానే ఇంట్లో ఉండే చిన్న చిన్న టెక్నిక్ ను అనుకరిస్తూ తప్పకుండా ఆరోగ్యంగా, అందంగా కనిపించవచ్చు. పైగా చర్మ సమస్యలను కూడా సులువుగా తొలగించుకోవచ్చు.. అయితే అందులో ముఖ్యంగా నిమ్మరసం ఎలా వాడాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
నిమ్మకాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది కేవలం ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఆయిల్ స్కిన్ లో ఏర్పడే బ్లేమిషెస్ తొలగించడానికి నిమ్మకాయ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. చనిపోయిన మృతకణాలను చర్మం నుండి తొలగించి, చర్మాన్ని శుభ్రం చేసి కాంతివంతంగా తయారు చేస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తొలగిస్తుంది..
చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారికి నిమ్మకాయ ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు.. ఇక చాలామంది క్లియర్ స్కిన్ కావాలని కోరుకుంటున్నారు. అందుకోసం ఇప్పుడు చెప్పబోయే ఒక పద్ధతిని మీరు అనుసరించక తప్పదు. అయితే ఇందుకోసం ముందుగా బాగా పండిపోయిన అరటిపండు తీసుకొని, దానికి కొద్దిగా నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి,పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే, మీ చర్మం చాలా క్లియర్ గా, క్లీన్ గా ఉంటుంది. అంతేకాకుండా చాలా అందంగా కూడా కనిపిస్తారు..
అయితే నిమ్మకాయ రసాన్ని ఎప్పుడూ నేరుగా ముఖం మీద అప్లై చేయకూడదు. ఇందులో ఉండే యాసిడ్ గుణాలు చర్మానికి హాని కలిగించవచ్చు. కాబట్టి నిమ్మకాయ రసాన్ని ఎప్పుడూ ఇంకొక దానికి జోడించి మాత్రమే ముఖానికి ఉపయోగించడం అవసరం.