శరీర అవయవాలు అన్నింటిలో అత్యంత సున్నితమైన భాగం చంక. ఈ ప్రాంతంలో అత్యధికంగా చెమట పడుతుంది.. సాధారణంగా చెమట పట్టే చోట బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇక ఎప్పుడైతే చెమట ఎక్కువగా పడుతుందో, అక్కడ బ్యాక్టీరియా వృద్ధి చెంది దురద మొదలవుతుంది. ఇక చంక ప్రాంతం క్షీణించడం ప్రారంభిస్తే దానిని ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది.. సాధారణంగా చంకలలో దురద అనేది అనేక కారణాల వల్ల కూడా సంభవిస్తుంది..

ముఖ్యంగా పరిశుభ్రతను పాటించకపోవడం, అధిక చెమట, వాతావరణ మార్పు, శిలీంద్ర అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, సబ్బులు లేదా పర్ఫ్యూమ్స్ లో టాక్సిన్స్ అధికంగా ఉండడం వంటి వాటి వల్ల  చంకల్లో దురద అలాగే దద్దుర్లు రావడానికి కారణమవుతాయి. ఇక వీటి వల్ల నొప్పి, దుర్వాసన ముదురు అలాగే ఎరుపు దద్దుర్లు ఏర్పడతాయి.. ఇక వీటి వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఇక వీటిని ఇబ్బంది లేకుండా తొలగించుకోవాలంటే కొన్ని సహజమైన మార్గాలను వెతుక్కోవాల్సి ఉంటుంది.. అందుకోసమే మీ ముందుకు కొన్ని సహజ మార్గాలను తీసుకొచ్చాము.. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిమ్మరసం :
నిమ్మరసంలో సహజంగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. దీనిలోని సిట్రిక్ ఆమ్లం బ్యాక్టీరియాను సులభంగా తొలగిస్తుంది. ఇందుకోసం నిమ్మకాయ ముక్కను చంకలో ఐదు నిమిషాలు మెత్తగా రుద్దండి. ఆ తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు నుంచి మూడు సార్లు చేయడం వల్ల దురద సమస్య తగ్గుతుంది..

టీ ట్రీ ఆయిల్ :
ఇక టీ ట్రీ ఆయిల్ కూడా చంకలో దురద అలాగే ఇన్ఫెక్షన్లను నాశనం చేసే, అద్భుతమైన ఔషధంగా పరిగణించబడుతుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు అధికంగా వున్నాయి. ఇవి చంకల్లో దురదకు కారణం అయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి. ఈ నూనె బాధాకరమైన చంక దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ టీ ట్రీ ఆయిల్ తీసుకొని, ఒక టేబుల్ స్పూన్ నీటిని వేసి బాగా కలపాలి. చంకల్లో అప్లై చేసి, పది నిమిషాలు ఆరనిచ్చి, ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి.. ఇలా చేయడం వల్ల దురద, రాషెస్ తగ్గిపోతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: