వేసవి కాలం వచ్చి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. బయటకు వెళ్లాలంటే ఎండ, పోనీ ఇంట్లో ఉందామంటే వేడి.. ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతమవుతూ ఉన్నారు.. ఇక మరో పక్క వేసవికాలంలో చెమట దుర్గంధం వాసన వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు.. అయితే ఇలాంటి సమస్యలన్నింటికి చెక్ పెట్టాలంటే, మనం చేసే స్నానం కూడా సరైన పద్ధతిలో ఉండాలి అంటున్నారు నిపుణులు.. ముఖ్యంగా వేసవి కాలంలో స్నానం చేయడానికి మూడు పద్ధతులున్నాయి. అయితే అవి ఏంటి..ఎలాంటి పద్ధతులలో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చో.. ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచాలి అంటే తప్పకుండా చెమట పట్టాలి. అలా పట్టిన చెమట ను తొలగించాలి అంటే స్నానం చేయాలి. అయితే స్నానం చేసిన తరువాత చెమట వాసన పోవాలి అంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రోజూ స్నానం చేసేటప్పుడు మంచినీళ్లతో కాకుండా ఆ నీళ్ళలో కొన్ని సుగంధపు వాసనలు వెదజల్లే లిక్విడ్ ను ఉపయోగించాలి. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల వాషింగ్ జల్ లు లభ్యమవుతున్నాయి. కాబట్టి రోజుకో రకం ప్లేయర్ తీసుకొచ్చి, స్నానం చేసే నీళ్ళలో వేసి స్నానం చేస్తే మంచి సువాసన ఉండడమే కాకుండా తాజాగా కూడా ఉండవచ్చు..


రోజ్ వాటర్ లో తెల్ల చందనం కలిపి స్నానం చేస్తే రోజంతా తాజాగా ఉండడమే కాకుండా, మీ చుట్టుపక్కల వాళ్లకు కూడా పరిమళాలు వస్తూ ఉంటాయి. ఇక రోజువారీ స్నానానికి బదులుగా అప్పుడప్పుడూ లేదా వారానికి ఒకసారైనా.. స్పా బాత్ ని ఇంటిదగ్గరే చెయ్యాలి. ఇందుకోసం వాషింగ్ వాటర్‌లో కొద్దిగా వాషింగ్ పౌడర్ కలపాలి. అలాగే.. కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. చివరిగా పుదీనా ఆకుల జ్యూస్ కలిపి స్నానం చెయ్యాలి. ఈ స్నానం తర్వాత..పరిశుభ్రమైన నీటిని శరీరమంతా పోసుకోవాలి. తద్వారా వాషింగ్ పౌడర్ నీరు మీ శరీరంపై ఉండదు. ఈ స్నానం మిమ్మల్ని రోజంతా తాజాగా, వెచ్చగా ఉంచుతుంది. మీ శరీరం ఇదివరకటి కంటే ఎక్కువగా మెరుస్తుంది.


ఫ్రెండ్స్ చూశారు కదా..! మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలాంటి స్నానాలు చేసి, ఈ వేసవి కాలంలో కూడా తాజాగా ఆరోగ్యంగా ఉండండి.


మరింత సమాచారం తెలుసుకోండి: