ముఖంపై మొటిమలు తగ్గి యవ్వనంగా కనబడాలంటే ప్రతి రోజూ నిమ్మకాయ రసం తాగండి.నిమ్మ కాయలో ఉండే విటమిన్ సి.. పొడి బారిన చర్మానికి, పగిలిన చర్మానికి చాలా మంచిదట. అందుకే రెండు రోజులకు ఒక సారైనా ఓ గ్లాసు లెమన్ వాటర్ తాగితే బెస్ట్. నిమ్మ కాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువగా ఉండడంతో స్కిన్ క్లిన్సెర్‌గానూ పని చేస్తుంది. తరచూ తాజా నిమ్మరసం తాగితే మీ చర్మం మెరవడం ఖాయం.ఇక అలాగే టమాట, క్యారెట్, కీరా దోస, కమలా పండు కలిపి జ్యూస్ చేసి తాగితే స్కిన్ టోన్ పెరుగుతుంది. వారానికి ఒకసారైనా తాగండి.దానిమ్మ పండులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. క్రమం తప్పకుండా దానిమ్మ జ్యూస్ తాగితే స్కిన్ గ్లో పెరుగుతుంది.యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రేప్ జ్యూస్ తీసుకుంటే రక్త ప్రసరణ పెరిగి చర్మం మిలమిలా మెరవడం ఖాయం.


కీరా దోస జ్యూస్ తాగితే మెటిమలు తగ్గుతాయి. స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది. మచ్చలను తగ్గిస్తుంది.ఇక అలాగే మొటిమలు తగ్గి యవ్వనంగా కనపడాలంటే క్యారెట్ జ్యూస్ తీసుకోవాల్సిందే. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తొలగించాలన్నా, స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గించాలన్నా క్యారెట్ జ్యూస్ తాగండి. ఇందులోని విటమిన్ ఎ.. చర్మం గ్లో పెంచుతుంది. ఈ క్యారెట్‌కి బీట్‌రూట్ మిక్స్ చేసి జ్యూస్‌లా తీసుకుంటే ఆరోగ్యంతోపాటు చర్మ రక్షణకు మంచిది. బీట్‌రూట్ తీసుకుంటే శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ సంఖ్య పెరుగతుంది. అలాగే.. రక్తంలో మలినాలు ఉంటే బయటకు పోతాయి.ఆ మలినాలు పోవడం వలన నిత్యం యవ్వనంగా కనపడతారు.చెర్రీ జ్యూస్ తాగితే స్కిన్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. డల్‌గా ఉండే స్కిన్‌ను ఫ్రెష్‌గా చేయడంలో సహాయ పడుతుంది.పీచు పదార్థాలు, విటమిన్ సి పుష్కలంగా ఉండే ‘బ్రకోలీ’ జ్యూస్ తాగితే స్కిన్ టెక్స్చర్ మెరుగుపడుతుంది.ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: