ఇదేంటి ఇప్పుడు మామిడికాయతో కూడా ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా అని ఆలోచిస్తున్నారా..? నిజమేనండి.. ప్రకృతిలో లభించే ప్రతి కాయ, పండు ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంటుందని ప్రతి ఒక్కరికీ తెలిసిందే.  ఇక అందులో భాగంగానే మామిడికాయతో కూడా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు  అంటున్నారు సౌందర్య నిపుణులు.. అయితే ఈ మామిడితో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి..దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో.. ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మామిడితో మన అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు.. మామిడికాయ లో ఉండే గుణాలు నల్ల మచ్చలు, మొటిమలు వంటి సమస్యలను పోగొట్టి, ముఖం లో కొత్తదనాన్ని నింపుతాయి.. ఈ మామిడికాయను స్క్రబ్బింగ్, ట్యానింగ్, ఫేస్ వాష్, ఫేస్ ప్యాక్ ఇలా వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ మామిడికాయ గుజ్జుకు, ఓట్మీల్ అలాగే బాదం తో కలిపి కూడా ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు..


ఇక ఎప్పుడైనా పొరపాటున దెబ్బతగిలి రక్తస్రావం జరుగుతున్నప్పుడు, పచ్చిమామిడి బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా పచ్చిమామిడికాయలు వేడినీటిలో వేసి బాగా మరిగించి, ఆ రసాన్ని దెబ్బ తగిలిన ప్రాంతంలో రాయడమే.. ఇలా చేయడం వల్ల రక్తస్రావం ఆగిపోతుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు ఈ నీటితో ముఖాన్ని శుభ్ర పరచుకోవచ్చు. ఫలితంగా ముఖంపై వచ్చే మచ్చలు,  మొటిమలు లాంటి చిన్న చిన్న సమస్యలకు ఉపశమనం దొరుకుతుంది..


అంతేకాకుండా మండే వేసవిలో చర్మం పై ట్యాన్ ఏర్పడటం సహజమే. ఈ ట్యాన్ ను తొలగించుకోవడానికి మామిడి గుజ్జు ఎంతగానో ఉపయోగపడుతుంది.. ఇందుకోసం ఒక చెంచా గోధుమ పిండి, కొద్దిగా మామిడిపండు గుజ్జు. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేయాలి. ఒక అరగంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరచుకొని, ఆ రంధ్రాల్లో ఉన్న దుమ్ము ధూళి పూర్తిగా తొలగిపోతాయి. ఫలితంగా ట్యాన్ సమస్య తగ్గుతుంది..


 ఒక చర్మ రంగును పెంపొందించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.. ఇక ఇందుకోసం నీరు, పాలలో నానబెట్టిన బాదం పేస్ట్,  ఓట్మీల్, మామిడి గుజ్జు అన్నీ కలిపి తయారు చేసే ఈ ఫేస్ ప్యాక్ అన్ని రకాల చర్మ తత్వాలకు ఉపయోగపడుతుంది.. ఇందుకోసం ఒక చెంచా మామిడి గుజ్జులో కొద్దిగా బాదం పేస్ట్ 2-3  చెంచాల పాలు వేసి, బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి .. ఇలా చేయడం వల్ల అతి తక్కువ కాలంలోనే ముఖ అందం పెరగడం గమనించవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: