ఈ రోజుల్లో దాదాపు అమ్మాయిలందరూ బరువు తగ్గి నాజూగ్గా కనిపించేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటారు. అయితే కొంతమంది వారు చేసే పొరపాట్ల వల్ల వాళ్ళకి తెలియకుండానే వీపు నల్లగా, వీపు భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి, బొద్దుగా చర్మం సాగి వేలాడి నట్టుగా కనిపిస్తుంటుంది. దీంతో వారికి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. అయితే ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళలలో వీపు భాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకు పోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గర్భం దాల్చినప్పుడు వీపు భాగంలో కొవ్వు ఎక్కువ చేరడం. మరికొంతమందికి పిక్క,నడుము భాగంలో, తదితర భాగాలలో అధిక మొత్తంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇలా పేరుకుపోవడం ద్వారా వారు మరింత లావుగా కనిపిస్తారు. అంతేకాకుండా  కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల  కూడా ఈ సమస్య ఎదురవుతుంది. అయితే ఈ సమస్యను ఎదుర్కోవాలంటే ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తొలగించుకోవచ్చు.


కొంతమందిలో థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. ఆ గ్రంథి శరీరంలో అనవసరమైన కొవ్వును కరిగించే థైరాయిడ్ హార్మోన్లను  సరిగా ఉత్పత్తి చేయదు. అది పని చేయకపోవడం వల్ల వివిధ  భాగాలలో  కొవ్వు అధికంగా పేరుకుపోయి,  లావుగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇంకొంత మందిలో ఇన్సులిన్ స్థాయి  పెరగడంవల్ల శరీర భాగలలో ఎక్కువగా కొవ్వు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వారు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

మనకు ఎక్కువగా దొరికే పిజ్జా , బర్గర్ , చిప్స్, స్టాల్ బిస్కెట్స్ వంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం ఖాయం. ఇవన్నీ శరీర బరువును పెంచడం మాత్రమే కాదు వీటిలో ఉండే కొవ్వులు,సోడియం, కార్బోహైడ్రేట్లు వంటి పదార్థాలు వీపు భాగంలో చేరి వీపు ఆకృతిని మార్చేస్తూ ఉంటాయి. అందువల్ల వీటిని ఎంత తగ్గిస్తే అంత మేలు.

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి . చర్మంపై ముడతలు,  శక్తిని కోల్పోవడం , వీటితో పాటు చర్మం కూడా పట్టు కోల్పోతుంది. దీంతో క్రమంగా చర్మం స్పాంజిలాగా మారిపోతుంది. అందుకే ముందు నుంచి మంచి పోషకాహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: