అందంగా ఉండాలంటే ముందుగా మన కళ్ళు బాగుండాలి.ఆకట్టుకునే కళ్ళు ఉంటేనే చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటారు. అయితే కొంతమందికి కళ్ళు వాపులు రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యల వల్ల కళ్ళకు వున్న అందం పోతుంది. ఇక కళ్ళ వాపు తగ్గి ప్రకాశవంతమైన కళ్ళ కోసం ఈ పద్ధతులు పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.కళ్ళు ప్రకాశవంతంగా ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా చెయ్యాల్సింది కంటికి సరిపడా నిద్ర, విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం.రోజుకి ఖచ్చితంగా 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. అలా చేస్తే కళ్ళు ప్రకాశవంతంగా ఉంటాయి.


కళ్ళను రోజుకు వీలైనంత వరకు రెండుసార్లుకంటే ఎక్కువ కడుగకూడదు. అలా చేస్తే కళ్ళు ఎర్రగా అవుతాయి. కాబట్టి అలా చెయ్యకూడదు. ఇక కళ్లు ఆరోగ్యంగా ఇంకా ప్రకాశంగా ఉండాలంటే మనం తినే ఆహారంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆకు కూరలు, బొప్పాయి, గుడ్లు, చేపలు, పాలు... ఉండేలా చూసుకోండి. కళ్లు మండుతున్నట్టు అనిపిస్తే బాగా మాగిన అరటి పండు తొక్కను కళ్లుకు సమంగా పరుచుకొని కొద్ది సేపు పడుకోవాలి.అలా చేస్తే కళ్ళు చాలా కూల్ అవుతాయి.. కీర దోసకాయను చక్రాలుగా కోసి కళ్ళ మీద పెట్టుకుంటే అలసట తగ్గుతుంది.ఇక కనుబొమ్మల వెంట్రుకలు ఎక్కువుగా రాలిపోతుంటే వాటికి ఆలివ్ ఆయిల్ అప్లై చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.


ఇక ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువ సేపు పనిచేసేవారు మధ్యమధ్యలో చల్లటి నీటితో మొహం కడుక్కోవాలి.కళ్లకింద ముడతలు పోవాలంటే... ఒక కప్పు నీళ్లలో ఎండు ఉసిరికాయని నానబెట్టాలి. మర్నాడు పొద్దున ఈ నీళ్లలో మరో కప్పు నీళ్లు కలిపి వాటితో కళ్లని కడుక్కోవాలి.ఇక ఎండలో బయటకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా బైక్ పైన వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నల్లని కళ్ళజోడు పెట్టుకోవాలి.అలాగే స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడకూడదు.స్మార్ట్ ఫోన్ల వల్ల కూడా కళ్ళు దెబ్బ తింటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: