
అలాగే బొప్పాయి పండు ముక్క తీసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. దీనికి చెంచా తేనె కలిపి.. రెండూ బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.ఇక ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.ఇక బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ చర్మంపై మ్యాజిక్ చేస్తాయి. ఇవి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంతో పాటు మృతకణాలను తొలిగించి చర్మాన్ని అందంగా మారుస్తాయి. తేనెలోని గుణాలు చర్మానికి మంచి తాజా లుక్ ని ఇస్తాయి.కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకొని వాటిని స్పూన్ సాయంతో లేదా బ్లెండర్‌లో వేసి మెత్తగా చేయాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ క్రీం కలపాలి. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి ప్యాక్ మాదిరిగా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే కమిలిపోయిన ముఖం తాజాగా ఉంటుంది.ఇక ఈ చిట్కాలు క్రమం తప్పకుండా పాటించండి. ఖచ్చితంగా చక్కటి ఫలితాలు ఉంటాయి.